గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2022 (10:07 IST)

ఇంట్లో మంటలు చెలరేగి ఐదుగురి సజీవ దహనం

anyang fire accident
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంటిలో మంటలు చెలరేగడం వల్ల ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన యూపీలోని మవు జిల్లాలో జరిగింది. మృతుల్లో ఓ మహిళ, ఒక పురుషుడు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఒక్కొక్కరికీ రూ.4 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెల్లించారు.
 
షాపూర్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, ఇంట్లోని స్టౌ నుంచి మంటలు చెలరేగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది, వైద్య సిబంది, ఇతర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.