బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (19:03 IST)

పెన్సిల్ షేవింగ్స్ గొంతులో ఇరుక్కుని ఆరేళ్ళ చిన్నారి మృతి

pencil shaving
పెన్సిల్ షేవింగ్స్ గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ రాష్ట్రంలోని హమీర్ పూర్ కొత్వాలి ప్రాంతంలో పహాడీ వీర్ గ్రామంలో నందకిషోర్ అనే వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలతో ఉంటున్నారు. బుధవారం సాయంత్రం కుమారుడు అభిషేక్ (12), కుమార్తె అన్షిక (8), ఆర్తిక (6)లు ఇంటి మిద్దెపై కూర్చుని చదువుకుంటున్నారు. అయితే, ఒకటో తరగతి చదవుతున్న ఆర్తిక హోం వర్క్ చేసేందుకు తన నోటిలో షార్ప్‌నర్ పెట్టుకుని పెన్సిల్ తిప్పంది. 
 
ఈ క్రమంలో షార్ప్‌నర్ నుంచి వచ్చిన పెన్సిల్ షేవింగ్స్ ఆ బాలిక నోటిలోకి వెళ్లింది. దీంతో ఆ బాలికకు ఊపిరాడక స్పృహతప్పి పడిపోయింది. ఈ విషయాన్ని అన్షిక్, అభిషేక్‌లు కింద వున్న తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆ బాలిక మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఆర్తిక మరణంతో తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.