గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (14:30 IST)

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం.. కోలీవుడ్ కమెడియన్ ఏబీ రాజు అరెస్ట్

AB Raju
AB Raju
కోలీవుడ్ హాస్యనటుడు ఏబీ రాజు దారుణానికి పాల్పడ్డాడు. చాక్లెట్ ఆశ చూపించి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కోలీవుడ్‌లో సంచలనంగా మారింది.  
 
వివరాల్లోకి వెళితే.. చెన్నైలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం వుంటున్న బీఏ రాజు.. అదే ప్లాటులో వుండే రెండో తరగతి చదివే చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడు. 
 
చిన్నారిది రాజుగారి కింద ఫ్లాటే కావడంతో ఖాళీ దొరికినప్పుడల్లా రాజు ఇంటికి వెళ్లి ఆడుకొంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఆగస్టు 14 రాత్రి చిన్నారి రాజు ఇంటికి వెళ్ళింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో రాజు బాలికను దగ్గరకు తీసుకొని చాక్లెట్ ఇస్తానని చెప్పి ఆమె ప్రైవేట్ భాగాలను తాకుతూ అత్యాచారం చేయడానికి యత్నించాడు. 
 
బాలిక ఏడవడం మొదలుపెట్టేసరికి ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ఏమి చెప్పలేదు. అయితే అప్పటి నుంచి బాలిక ముభావంగా ఉండడంతో తల్లిదండ్రులు గట్టిగా అడగడంతో విషయం బయటపెట్టింది. 
 
దీంతో వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజును విచారించగా నేరాన్ని ఒప్పుకోవడంతో అతడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.