సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 3 అక్టోబరు 2018 (14:41 IST)

బాలుడితో కానిస్టేబుల్ అసహజ శృంగారం.. ఎక్కడో తెలుసా?

ప్రజలను కంటికి రెప్పలా కాపాడాల్సిన రక్షకభటులే అకృత్యాలకు పాల్పడుతున్నారు. బాలుడితో ఓ కానిస్టేబుల్.. అసహజ శృంగారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చామద్‌గేట్ పోలీస

ప్రజలను కంటికి రెప్పలా కాపాడాల్సిన రక్షకభటులే అకృత్యాలకు పాల్పడుతున్నారు. బాలుడితో ఓ కానిస్టేబుల్.. అసహజ శృంగారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చామద్‌గేట్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  45 ఏళ్ల సంజేశ్ యాదవ్ అనే కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 
 
ఓ రోజు గస్తీ నిర్వహిస్తున్న సమయంలో హోటల్‌కి వెళ్లిన సంజేశ్.. అక్కడ పనిచేసే బాలుడిపై కన్నేశాడు. ఆ బాలుడిపై కానిస్టేబుల్‌కు వికృత కోరిక కలిగింది.. బాలుడిని మచ్చిక చేసుకుని తరచూ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చాడు. ఆ బాలుడితో అసహజ లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. ఇలా సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు ఈ దారుణం జరిగింది. 
 
మంగళవారం గాంధీ జయంతి సందర్భంగా కానిస్టేబుల్ సెలవుపై వెళ్లడంతో బాలుడు స్టేషన్‌కు వచ్చి ఉన్నతాధికారులకు తన గోడును వెళ్లబోసుకున్నాడు. అసహజ లైంగిక క్రీడతో పాటు తనను తీవ్రంగా గాయపరిచాడన్నాడు. దీంతో కానిస్టేబుల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశారు. కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు.