Vadodara car crash: గుంతలున్నాయ్.. కారు అదుపు తప్పింది.. అందుకే ప్రమాదం..
గుజరాత్‌లోని వడోదరలో కారు బీభత్సానికి ఒక మహిళ మృతి చెందింది. గుజరాత్‌లోని వడోదరలో అర్థరాత్రి తాగిన లా విద్యార్థి ఒక మహిళ, ఆమె బిడ్డను చంపి, మరో ఏడుగురిని గాయపరిచాడు. గురువారం రాత్రి అతివేగంగా కారును నడిపిన రక్షిత్ చౌరాసియా ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టడంతో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రోడ్డు పక్కన ఉన్న 8 మంది గాయాల పాలయ్యారు.
ఈ ఘటనకు కారణమైన రక్షిత్ చౌరాసియాను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. అయితే తాను మద్యం సేవించి వాహనం నడపలేదని పేర్కొన్నాడు. రోడ్డుపై ఉన్న గుంత కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని వివరించాడు. కారు టైరు గుంతలో పడటంతో అదుపుతప్పి.. పక్కనే ఉన్న స్కూటీని ఢీకొన్నట్లు తెలిపాడు.
అదే సమయంలో ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంతో తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పాడు. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 50 కిలోమీటర్ల స్పీడుతోనే వెళ్తోందని వివరించాడు. తాను ఆ సమయంలో మద్యం సేవించి లేనని.. హోలికా దహనం కార్యక్రమానికి వెళ్లి వస్తున్నట్లు రక్షిత్ చౌరాసియా తెలిపాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.