శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 ఆగస్టు 2021 (17:36 IST)

యుద్ధ విమానం పైలట్ సీట్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

కర్నాటక రాష్ట్రంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) కంపెనీని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తేజస్ యుద్ధ విమానమెక్కారు. 
 
ఈ కేంద్రంలో తేజస్‌తో పాటు లైట్ కంబాట్ హెలికాప్ట‌ర్లు త‌యారు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఉత్ప‌త్తి కేంద్రాల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. అయితే ఆ స‌మ‌యంలో తేజ‌స్ యుద్ధ విమానంపై ఉప‌రాష్ట్ర‌తి వెంక‌య్య‌నాయుడు ఎక్కి కూర్చుకున్నారు. 
 
పైల‌ట్లు కూర్చూనే సీటులో కూర్చున్న వెంక‌య్య‌నాయుడు ఆ యుద్ధ విమాన శ‌క్తిసామ‌ర్థ్యాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, తేజస్ యుద్ధ విమానం పనితీరుని ఉపరాష్ట్రపతికి హెచ్ఏఎల్ అధికారులు వివరించారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌ర్ థావ‌ర్‌చాంద్ గెహ్లాట్ కూడా పాల్గొన్నారు.