వివాదానికి కేంద్రంగా మారిన ఢిల్లీ మెట్రో రైలు.. కొట్టుకున్నారు..
ఢిల్లీ మెట్రో రైలు వివాదానికి కేంద్రంగా మారింది. ఢిల్లీ మెట్రో రైలు ప్రయాణీకులు ముద్దుమురెపాల కోసం వాడుకుంటున్నారు. ఇంకా ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో డ్యాన్స్‌ల గోల కూడా జరిగిపోతోంది. తాజాగా ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ప్రయాణీకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఫుటేజీలో, పురుషులు పంచ్‌లు ఇచ్చుకోవడం.... ఒకరినొకరు కొట్టుకోవడం చూడవచ్చు.
ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.