సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 27 జూన్ 2023 (16:32 IST)

అమితాబ్ నటించిన మెడిబడ్డీస్ కొత్త బ్రాండ్ ప్రచారము: 10 నిమిషాలలో వైద్య నిపుణులతో వీడియో సంప్రదింపుల సౌకర్యం

Amitab
భారతదేశపు ప్రముఖ డిజిటల్ ఆరోగ్య సంరక్షణ వేదిక, మెడిబడ్డీ, ఆన్లైన్ వీడియో వైద్య సంప్రదింపులను అందించడం ద్వారా భారతీయ ఆరోగ్యసంరక్షణ రంగములో ఎప్పటికప్పుడు విప్లవాన్ని తీసుకొస్తోంది. బిలియన్ల భారతీయులకు అత్యధిక-నాణ్యత ఉన్న ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకొనిరావడం మెడిబడ్డీ వారి స్వప్నము. ఈ వేదిక 10 నిమిషాలలో, 24X7, ఏడాదికి 365 రోజులూ ఒక వైద్య నిపుణుడితో ఆన్లైన్ వీడియో సంప్రదింపును అందించే హామీని ఇస్తుంది.
 
ఈ ప్రచారము శ్రీ. అమితాబ్ బచ్చన్ నటించిన బ్రాండ్ చిత్రాల సీరీస్ ను ప్రారంభించడము ద్వారా ఆరోగ్యకరమైన భారతదేశాన్ని సృష్టించడముపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈరోజులలో, అందరూ ఆరోగ్య-చేతన జీవనశైలిని అవలంబించే దిశగా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, ప్రజలు అనారోగ్యం పాలైతే, వైద్య నిపుణుల సలహాలను తీసుకోవడములోని ప్రాముఖ్యతను ఉపేక్షిస్తున్నారు. దీనికి కారణం వారు తామే స్వయంగా-చికిత్స తీసుకోగలము అని అనుకోవడం లేదా అయాచిత సలహాను అంగీకరించడం కారణం కావచ్చు. ఒక వైద్య నిపుణుడితో ఆన్లైన్ వీడియో సంప్రదింపును తమ ఇంటి నుంచి లేదా ఎక్కడి నుంచైనా 10 నిమిషాలలో అండుకొవచ్చుననే అవగాహన కల్పిస్తూ ఈ ప్రస్తుత పరిస్థితిని మార్చడం మెడీబడ్డీ యొక్క లక్ష్యము.
 
ప్రచారము గురించి మాట్లాడుతూ, శ్రీ. సతీష్ కన్నన్, సహ-వ్యవస్థాపకుడు & సీఈఓ, మెడీబడ్డీ, ఇలా అన్నారు, “బిలియన్ భారతీయులకు అత్యధిక-నాణ్యత కలిగిన ఆరోగ్య సంరక్షణను అందించుట మా ఉద్దేశము. మేము నిరంతరంగా పట్టణ మరియు గ్రామీణ ఆరోగ్య సంరక్షణ దూరాలను పూరించుటకు సాంకేతికతలో పెట్టుబడి పెడతాము. మా వేదిక తోటి భారతీయులకు 10 నిమిషాలలో ఒక వైద్యుడిని సంప్రదించే సౌకర్యాన్ని అందిస్తుంది మరియు వైద్య నిపుణులు మరియు ఆరోగ్యసంరక్షణ సేవలకు ప్రాప్యతను నిర్ధారిస్తుంది . ఇది తెలిసిన నిర్ణయాలు తీసుకోవడములో వారికి సహాయం చేస్తుంది, తద్వారా ఒక ఆరోగ్యకరమైన సంఘానికి దారితీస్తుంది. ఆన్లైన్ వీడియో వైద్యుల సంప్రదింపుల సౌకర్యము మరియు ప్రాప్యత గురించి అవగాహన కలిగించే సందేశము ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు తీసుకొస్తుందని మరియు ఆరోగ్యకరమైన ఎంపికలు చేసుకోవడములో సహకరిస్తుందని మేము విశ్వసిస్తున్నాము.”
 
శ్రీ. సైబాల్ బిశ్వాస్, హెడ్ ఆఫ్ మార్కెటింగ్, భాగస్వామ్యాలు & పిఆర్, మెడీబడ్డీ, ఇలా అన్నారు, “వైద్య నిపుణుల నుండి సూచనలను తీసుకోవడములో ప్రజలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు లేదా వాయిదా వేస్తారు అనే వాస్తవముపై కొత్త బ్రాండ్ ప్రచారము ఆధారపడింది. ఇది యథాతధ స్థితిని అంగీకరించడములోని సవాళ్ళ స్థానములో ఆన్లైన్ వీడియో వైద్య సంప్రదింపును ఎంపిక గుర్తుకు వచ్చేలా చేయడం దీని లక్ష్యము. వైద్య నిపుణుల సంప్రదింపును పొందడం బ్యాంకింగ్, షాపింగ్ మరియు ఆహారం డెలివరీల వంటి రోజువారి ఆన్లైన్ పనుల మాదిరిగా సౌకర్యవంతమైనది అని ఇది ఉద్ఘాటిస్తుంది. ప్రకటన చిత్రాలలో శ్రీ. బచ్చన్ నటించడం, తమ ఆరోగ్యసంరక్షణ ప్రయాణములో యూజర్లకు సహకరించుటకు ఒక నిపుణుడైన సంరక్షకుడిగా మెడీబడ్డీ యొక్క స్థానాన్ని తెలుపుతుంది. ప్రకటనలలో, శ్రీ. బచ్చన్ మొబైల్ ఫోన్ నుండి ఆశ్చర్యకరంగా ఒక కొత్త వేషధారణలో బయటికి వస్తారు, ఒక బడ్డీలాగా మరియు ఒక మెడెబడ్డీ యాప్ యొక్క సజీవ మానవీకరణగా కనిపిస్తారు.”