గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 మార్చి 2023 (22:27 IST)

శివం భరద్వాజ్.. స్కర్ట్‌లో అబ్బాయి.. వీడియో వైరల్

Guy In A Skirt
Guy In A Skirt
మీరట్‌కు చెందిన 24 ఏళ్ల శివం భరద్వాజ్ తన ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌తో మంచి పేరు కొట్టేశాడు. తాజాగా ఓ స్కర్ట్ ధరించి నెటిజన్లను ఆకట్టుకున్నాడు. తాజా వీడియోలో అతను స్కర్ట్ ధరించి, ముంబై లోకల్ ట్రైన్‌లో నమ్మకంగా నడుచుకుంటూ వెళుతున్నట్లు కనిపిస్తుంది.
 
అయితే చూపరులు అతనిని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అతను సన్ గ్లాసెస్‌తో లుక్‌ను పూర్తి చేశాడు. ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. the man in the skirtగా ఆతనిని నెటిజన్లు పిలుస్తున్నారు. 
 
తన జీవితంలో శివమ్ సవాళ్లను ఎదుర్కొన్నాడు. అతను తన తల్లిని మినహాయించి, అతని కుటుంబ సభ్యుల నుండి చాలా మంది నుండి విమర్శలను ఎదుర్కొన్నాడు. అయినా శివమ్ పట్టుదలతో ముంబైలో స్థిరపడటానికి కష్టపడ్డాడు. చివరికి, అతను నగరంలో ఫ్యాషన్ బ్లాగర్‌గా పేరు తెచ్చుకోవడంలో విజయం సాధించాడు.