శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (11:35 IST)

యుద్ధ వీరుడు కోసం పాక్ సైన్యాన్ని తుడిచిపెట్టేయాలని భావించాం.. : బీఎస్ ధనోవా

పాకిస్థాన్ యుద్ధ విమానాలను వెంబడిస్తూ భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పొరపాటున పాకిస్థాన్ ఆధీనంలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత అభినందన్‌న పాక్ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అభినందన్‌ను ప్రాణాలతో తీసుకుని వచ్చేందుకు ఏకంగా పాకిస్థాన్‌పై దాడి చేసేందుకు భారత్ సిద్ధమైంది. 
 
ఇదే అంశంపై అపుడు వైమానికదళ అధిపతిగా ఉన్న ధనోవా ఇపుడు స్పందిస్తూ, పాక్ యుద్ధ విమానాలను వెంబడిస్తూ పొరపాటున ఆ దేశ సైనికులకు చిక్కిన భారత్ వైమానిక దళ వింగ్ కమాండర్‌ను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అవసరమైతే పాక్‌ సైనిక విభాగాల్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలనుకున్నామని బీఎస్ ధనోవా చెప్పుకొచ్చారు. 
 
పాక్ చేసిన దుస్సాహసం కనుక విజయవంతమై ఉంటే అది జరిగే ఉండదేని గుర్తు చేశారు. అభినందన్ వర్ధమాన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించకుంటే యుద్ధం తప్పదన్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ వ్యాఖ్యలతో ఆ దేశ ఆర్మీ చీఫ్ బజ్వా వణికిపోయారన్న వార్తలపై ధనోవా తాజాగా స్పందించారు. 
 
అప్పట్లో వర్ధమాన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించడం మినహా పాకిస్థాన్‌కు మరో మార్గం లేకుండా పోయిందన్నారు. వర్ధమాన్‌ను బందీగా తీసుకున్న తర్వాత పాకిస్థాన్‌ దౌత్యపరంగానేకాకుండా, రాజకీయంగానూ విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొందన్నారు. 
 
భారత్ కనుక యుద్ధానికి సన్నద్ధమైతే అది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో తెలుసు కాబట్టే పాక్ నేతలకు ముచ్చెమటలు పోసి ఉంటాయని ధనోవా వివరించారు. కానీ, పాకిస్థాన్ ఇప్పటికీ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ, భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రకార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు.