గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వి
Last Modified: గురువారం, 29 అక్టోబరు 2020 (13:58 IST)

ఎయిర్ ఇండియా విమానాలపై హాంకాంగ్ ప్రభుత్వం నిషేధం, కరోనాతో వస్తున్నారనీ...

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రవాణా సౌకర్యాలు స్తంభించి పోయాయి. దీంతో పలు దేశాలు తమ దేశ విమానాలపై పలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానాలపై హాంకాంగ్ మరోసారి నిషేధం విధించింది.
 
భారత్ నుండి వస్తున్న కొందరు ప్రయాణికులకు కోవిడ్ నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాపై హాంకాంగ్ బ్యాన్ విధించడం ఇది నాలుగోసారి. అయితే తాజా నిషేధం నవంబరు 10 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది.
 
భారత్ నుంచి హాంకాంగ్ వచ్చే ప్రయాణికులు ప్రయాణానికి 72 గంటల ముందుగా కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ఇస్తేనే అనుమతిస్తామని ఆ దేశం ఆదేశాలు జారీచేసింది. అయితే ముంబై నుంచి వెళ్లిన ప్రయాణికులకు పాజిటివ్ నిర్ధారణ కావంతో ఆ దేశ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.