ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్‌లను నిషేధించండి: కేంద్ర మంత్రికి జగన్ లేఖ
ఆన్లైన్ బెట్టింగ్‌ల ద్వారా యువత తీవ్రంగా నష్టపోతున్నారని, ఆన్లైన్ జూదాల వలన ఎందరో యువత ఆత్మహత్యలకు పాల్పడుతుండటం పలుసార్లు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి యాప్‌లకు అనుమతులివ్వడం వలన భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తెలెత్తుతాయన్న ఉద్దేశంతో ఏపీ సీఎం జగన్ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ వ్రాసారు.
ఆన్లైన్ బెట్టింగులకు యువత బానిసలుగా మారిపోతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వీటి బారిన పడి డబ్బులు నష్టపోయిన వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్‌లు, గ్యాంబ్లింగ్ పైన ఉక్కుపాదం మోపేందుకు 1974 ఏపీ గేమింగ్ చట్టంలో సవరణ కూడా తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రంలో మొత్తం 132 వెబ్సైట్లు గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌కు కారణమవుతున్నాయని వాటిని వెంటనే నిషేధించాలని కోరుతూ వాటి వివరాలను ముఖ్యమంత్రి జగన్ తన లేఖలో జతచేసి కేంద్ర మంత్రికి పంపారు.