ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (22:03 IST)

మరిదితో వివాహేతర సంబంధం, చూసిన భర్తను రైలుపట్టాలపై పడుకోబెట్టి..?

మరిదితో ఏడేళ్ళ పాటు ఎవరికీ అనుమానం రాకుండా అక్రమ సంబంధాన్ని కొనసాగించిందో మహిళ. అంతటితో ఆగలేదు భర్తకు విషయం తెలిసిపోయిందని అతడిని అతి దారుణంగా చంపేసింది. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయింది.
 
బీహార్ లోని బేగుసరాయ్ ప్రాంతమది. కన్నయ్యలాల్, సోనిలు ఇద్దరు దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. గత ఏడు సంవత్సరాల నుంచి తన మరిదితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది సోని. ఎవ్వరికీ అనుమానం రాకుండా మరిదితో శారీరకంగా కలిసేది. 
 
అయితే రెండురోజుల క్రితం ఇద్దరూ కలిసి ఉండటాన్ని కళ్ళారా చూశాడు భర్త. ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. కుటుంబం నాశనమైపోతుందని హెచ్చరించాడు. అయినా ఆమె మారకపోగా భర్త హత్యకే ప్లాన్ చేసింది. మద్యం అలవాటు ఉన్న భర్త తాగి ఇంటికి వచ్చాడు.
 
అన్నంలో మత్తు మందు కలిపింది. అప్పటికే మద్యం తాగి జోగుతున్న కన్నయ్యలాల్ మత్తు మందు కలిపిన అన్నం తినేసి పూర్తిగా స్పృహ కోల్పోయాడు. ప్రియుడితో కలిసి భర్తను రైల్వే ట్రాక్ పైన తీసుకెళ్ళి పడుకోబెట్టింది. రైలు రావడంతో అతడి శరీరం ముక్కలు ముక్కలై శరీరం ఛిద్రమయింది. ఉదయాన్నే రైల్వేపోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.
 
అయితే తన భర్త ఆర్థిక పరిస్థితి బాగా లేదని ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.