శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 జూన్ 2017 (16:43 IST)

ఒంటరిగా ఉంటే అసభ్యంగా ప్రవర్తించాడనీ బావను చితక్కొట్టిన మరదలు

ఆ మహిళ అపర కాళీమాతలా మారిపోయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తన బావ చేసిన వెకిలి చేష్టలకు ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. అంతే ఒక్కసారిగా అపరకాళిగా మారి చొక్కాపట్టుకుని బయటకులాక్కొచ్చి.. నలుగురి ముందు చితక్క

ఆ మహిళ అపర కాళీమాతలా మారిపోయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తన బావ చేసిన వెకిలి చేష్టలకు ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. అంతే ఒక్కసారిగా అపరకాళిగా మారి చొక్కాపట్టుకుని బయటకులాక్కొచ్చి.. నలుగురి ముందు చితక్కొట్టిందా మరదలు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఈ సంఘటన ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
మీరట్‌కు చెందిన ఓ ఉమ్మడి కుటుంబం ఉంది. ఇందులో అన్నాతమ్ముడితో పాటు వారి భార్యలు కూడా ఉన్నారు. అయితే, మరదలు ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె బావ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆదిపరాశక్తిగా మారిన ఆమె... త‌న‌ బావను వీధిలోకి ఈడ్చుకొట్టి చిత‌క్కొట్టింది. ఆది ప‌రాశ‌క్తిలా ఆమె త‌నపై దాడి చేయ‌డంతో ఏం చేయాలో తెలియ‌క బిత్త‌ర‌పోయాడు ఆ వ్య‌క్తి. 
 
అతడి చొక్కా పట్టుకొని ఇంట్లోంచి వీధిలోకి ఈడ్చుకొచ్చిన ఆ యువ‌తి ఓ చోట కూర్చొబెట్టి నలుగురిలో త‌న బావ‌ను చావ‌బాదింది. మ‌రోసారి యువ‌తిపై క‌న్నెత్తి చూడ‌కుండా బుద్ధి చెప్పింది. ఇంట్లో తనకు చేసిన అవమానాన్ని, తనపై లైంగిక దాడికి పాల్పడ‌టానికి త‌న బావ చేసిన ప్రయత్నాన్ని ఆ మరదలు త‌న‌కు త‌గిలిన‌ గాయాలే సాక్ష్యాలుగా అందరికీ చూపించింది. ఈ ఘ‌ట‌న‌ జరుగుతున్నప్పుడు తీసిన వీడియోను జాతీయ ఛానెళ్లలో ప్రసారం చేశారు. ఆ యువతి ధైర్యాన్ని ప్రశంసించారు.