గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2017 (09:45 IST)

ఆస్పత్రిలో మహిళపై గ్యాంగ్ రేప్.. భర్త కోసం భోజనం తీసుకువచ్చేందుకు వెళితే..

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఆదిత్యనాథ్ సీఎం అయినా మహిళలపై అకృత్యాలకు అడ్డుకట్ట పడట్లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను ఆస్పత్రికి తీసుకెళ్తే.. భార్యపై ముగ్గురు ఆస్పత్రి

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఆదిత్యనాథ్ సీఎం అయినా మహిళలపై అకృత్యాలకు అడ్డుకట్ట పడట్లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను ఆస్పత్రికి తీసుకెళ్తే.. భార్యపై ముగ్గురు ఆస్పత్రి సిబ్బంది గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన యూపీ రాజధాని లక్నోలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. హోర్దోయ్‌కు చెందిన 42 ఏళ్ల మహిళ తన భర్తకు అనారోగ్యంగా ఉండటంతో కింగ్ జార్జి మెడికల్ యూనివర్శిటీ హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. రాత్రి భోజనం తీసుకువచ్చేందుకు బయటకు వెళ్తుండగా ఆ మహిళపై ఆస్పత్రి ప్రాంగణంలోనే బలవంతంగా లాక్కెళ్లి ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ ‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన నిందితులను  అరెస్ట్ చేశారు.