శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (10:18 IST)

ఇద్దరు పిల్లలను సినిమా థియేటర్‌లోకి పంపించి వివాహిత ఆత్మహత్య

suicide
చెన్నై విమానాశ్రయంలో దారుణం జరిగింది. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతూ వచ్చిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లను సినిమాకు పంపించి, ఆమె ఆత్మహత్య చేసుకుంది. చెన్నై ఎయిర్‌పోర్టులో కొత్తగా నిర్మించిన పార్కింగ్ టెర్మినల్‌ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
చెన్నై పొళిచ్చలూరు కమిషనర్ కాలనీకి చెందిన ఐశ్వర్య (33) అనే మహిళ భర్త ఉద్యోగం నిమిత్తం అమెరికాలో ఉంటున్నారు. ఈమె తన ఇద్దరు పిల్లలతో చెన్నైలో ఉన్నారు. గత కొంతకాలంగా కుటుంబ సమస్యలతో తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ వచ్చారు. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వల్ రెండో భాగం చిత్రం చూసేందుకు చెన్నై ఎయిర్‌ పోర్టులోని ఓ మల్టీప్లెక్స్ థియేటర్‌కు తన ఇద్దరు పిల్లలను ఆ మహిళ తీసుకెళ్లారు.

ఇద్దరు పిల్లలకు టిక్కెట్ తీసి థియేటర్‌లోకి పంపించిన ఆ మహిళ..  పార్కింగ్‌ ఏరియాను చూసేందుకు వెళుతున్నట్టు చెప్పి నాలుగో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు దూకేశారు. దీంతో ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్టు పోలీసులు మృతదేహన్ని స్వాధీన చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.