శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 జులై 2024 (11:24 IST)

బస్సు టర్నింగ్ ఇచ్చుకుంది.. మహిళ రోడ్డుపై ఎలా పడిందంటే? (Video)

woman
woman
సోషల్ మీడియాలో భీభత్సకరమైన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. గతంలో పుట్ బోర్డు దగ్గర దిగేందుకు సిద్ధంగా ఓ యువతి బ్రేక్ పడటంతో మెట్లు నుంచి కిందపడబోయింది. అంతే వెంటనే అప్రమత్తమైన కండెక్టర్ ఆ యువతిని కాపాడాడు. వెంటనే స్పందించి ఆ యువతిని కాపాడిన వైనం అందరినీ ఆశ్చర్యపరిచింది. 
 
ఈ వీడియో వైరల్ కావడంతో ఆ కండెక్టర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అయితే తాజాగా ఓ వీడియోలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ దారుణంగా గాయాలపాలైంది. 
 
బస్సు లోపల నిల్చుని వుండిన మహిళ.. బస్సు టర్నింగ్ అవుతుండగా.. ఫుట్ మెట్ల నుంచి కిందపడిపోయింది. అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. బస్సు వేగంగా టర్నింగ్ తీసుకోవడంతో మహిళ కిందపడిపోయింది.. బస్సు అలానే చాలా దూరం పోయాక ఆగింది. 
 
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనలో మహిళకు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. ఈ ఘటన తమిళనాడు, రాశిపురంలో జరిగింది.