గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 24 జూన్ 2024 (16:50 IST)

వ్యక్తి ప్రాణం తీసిన ఆవు.. ఎలా? వీడియో వైరల్

cow attack on biker
తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలో ఓ ఆవు ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తిపై ఆవు దాడి చేసింది. దీంతో ఆ వ్యక్తి ఎదురుగా వస్తున్న బస్సు కింద పడి మృత్యువాతపడ్డాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
కోర్టు ఉద్యోగి అయిన రాజ్ అనే వ్యక్తి బైకుపై వెళుతుండగా రోడ్డు పక్కన రెండు ఆవులు పోట్లాడుకుంటున్నాయి. అందులో ఒక ఆవు ఒక్కసారిగా ఎవరూ ఊహించని విధంగా రాజ్‌ను కొమ్ములతో పొడిచింది. దీంతో ఎదురుగా వస్తున్న బస్సు చక్రాల కింద రాజ్ పడిపోవడం, అతనిపై బస్సు చక్రాలు ఎక్కడం అంతా క్షణాల్లో జరిగిపోయాయి. ఈ ఘటన తాలూకు వీడియో బయటకు రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.