మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 జూన్ 2021 (12:09 IST)

'వరల్డ్ లార్జెస్ట్ గ్రీన్ రైల్వే'గా దిశగా భారతీయ రైల్వే అడుగులు

ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా గుర్తింపు పొందిన భారతీయ రైల్వే మరో అరుదైన రికార్డును సొంతం చేసుకునే దిశగా కృషి చేస్తోంది. వరల్డ్ లార్జెస్ట్ గ్రీన్ రైల్వేగా అవతరించేందుకు తమ వంతు కృషి చేస్తున్నాయి. 
 
ఇందులోభాగంగా 2030లోగా 'శూన్య కర్బన ఉద్గార' లక్ష్యం సాధించే దిశగా ముందడుగు వేస్తున్నాయి. ఈ మేరకు “పర్యావరణ హిత, సమర్థ, చౌకైన, సమయపాలక, ఆధునిక” ప్రయాణ సాధనంగా అవతరించాలన్న కోణంలో రైల్వేలకు మార్గనిర్దేశం చేస్తున్నది. 
 
అంతేకాకుండా పెరుగుతున్న ‘నవ భారత’ అవసరాలను తీర్చగల సరకు రవాణా సాధనంగా ముందంజ వేస్తున్నది. భారీ విద్యుదీకరణ… నీరు, కాగితం వాడకం తగ్గించడం తోపాటు రైలుపట్టాలపై గాయాల నుంచి జంతువుల రక్షణ వరకు అనేక చర్యలతో పర్యావరణ పరిరక్షణలోనూ తోడ్పడేందుకు భారత రైల్వేలు కృషి చేస్తున్నాయి.
 
పర్యావరణ హితమైనదే కాకుండా కాలుష్యాన్ని తగ్గించే రైలుమార్గాల విద్యుదీకరణ కార్యక్రమం 2014 నుంచి నేటికి 10 రెట్లు అధికంగా నమోదైంది. విద్యుత్‌ మార్గాలవల్ల ఒనగూడే లబ్ధిని వేగంగా అందిపుచ్చుకోవడంసహా మిగిలిన బ్రాడ్‌గేజి మార్గాల విద్యుదీకరణను 2023కల్లా పూర్తిచేసి 100 శాతం లక్ష్యాన్ని చేరే ప్రణాళికలను కూడా రైల్వేశాఖ సిద్ధం చేసుకుంది.