బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 జనవరి 2025 (09:04 IST)

ట్యూషన్‌కు వచ్చే బాలుడితో 23 యేళ్ళ యువతి ప్రేమ...

lovers
తన వద్దకు ట్యూషన్‌కు వచ్చే మైనర్ బాలుడుతి 23 యేళ్ల యువతి ప్రేమలో పడింది. దీంతో అతనితోనే కలిసి జీవించేందుకు ఆ బాలుడుని కిడ్నాప్ చేసింది. ఇందుకోసం తన స్నేహితుడి సాయం తీసుకుని, పుదుచ్చేరికి చేరుకుంది. దీనిపై బాధిత బాలుడు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ప్రేమ జంటతో పాటు.. వారికి సహకరించిన యువకుడుని పుదుచ్చేరిలో అదుపులోకి తీసుకుని చెన్నై నగరానికి తీసుకొచ్చారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
స్థానిక చెన్నై ఎంజీఆర్ నగర్‌కు చెందిన 15 యేళ్ల బాలుడు.. పదో తరగతి ఫెయిలై స్థానికంగా ట్యూషన్‌లో చేరాడు. అక్కడ ట్యూషన్లు చెప్పే మహిళ సోదరి అతడిని ప్రేమించింది. ఈ క్రమంలో డిసెంబరు 16వ తేదీన బయటకు వెళ్లిన బాలుడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో అతడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
 
బాలుడికి ట్యూషన్ చెబుతున్న మహిళ చెల్లెలు, కేకే నగర్‌కు చెందిన రాహుల్, బాలుడు కలిసి పుదుచ్చేరికి వెళ్లినట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లి ముగ్గురిని చెన్నైకి తీసుకొచ్చారు. బాలుడు, యువతి ప్రేమించుకుంటున్నారని, కలిసి జీవించేందుకు నిర్ణయించుకున్న వారు రాహుల్ సాయంతో పుదుచ్చేరికి వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. యువతిపై కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న ఆల్ ఉమెన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.