సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 నవంబరు 2024 (15:59 IST)

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

suicide
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ప్రియుడుని వివాహం చేసుకునేందుకు యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఆ యువతి తీవ్ర మనస్తాపం చెందిన బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన ఏపీలోని విజయవాడ నగరం చిట్టి నగర్‌లో చోటుచేసుకుంది. ఈ యువతి కాలువలో దూకి ప్రాణాలు తీసుకుంది. 
 
వివరాలను పరిశీలిస్తే, చిట్టి నగర్‌కు చెందిన 19 యేళ్ల యువతికి ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మనసులు కలవడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని యువతి తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. 
 
అయితే, ఆ యవతి తల్లిదండ్రులు మాత్రం ఆ పెళ్లికి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తానికిగురైన ఆ యువతి ఈ నెల 24వ తేదీన కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి యువతి మృతదేహం కోసం గాలించగా, రామవరప్పాడు వంతెన సమీపంలో శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.