ప్రభుత్వ కొలువున్న వరుడు కావలెను .. నల్లగా ఉన్నా ఫర్వాలేదంటున్న యువతి (Video)
తనకు ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వరుడు కావాలని, అతను నల్లగా ఉన్నప్పటికీ ఫర్వాలేదని ఆ యువతి అంటున్నారు. ఇందుకోసం ప్లకార్డును చేతపట్టుకుని రోడ్లపై తిరుగుతున్నారు. ఆ యువతి చేసిన ఫ్రాంక్ వీడియో ఒకటి ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ యువతి సెటైరికల్‌గా ఈ వీడియో చేసింది.
ఓ యువతి పెళ్లి కుమార్తెలా ముస్తాబై చేతిలో ప్లకార్డుతో రోడ్డుపై నిల్చొంది. ఆ కార్డుపై ప్రభుత్వ ఉద్యోగం ఉన్న పెళ్లి కుమారుడు కోసం చూస్తున్నా అని రాసివుంది. రోడ్డుపై వచ్చిపోయే వారిని మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా? అంటూ అడుగుతూ కాదనగానే సారీ చెప్పి పక్కకు జరుగుతోంది. నల్లగా ఉన్నా సరే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే పెళ్లి చేసుకుంటానని చెబుతోంది.
చివరకు ఓ మధ్య వయస్కుడు ఆమె దగ్గరకు వచ్చి తాను ప్రభుత్వ ఉద్యోగినని చెప్పడంతో సిగ్గుపడుతూ పెళ్లికి సమ్మతించింది. అబ్బాయి ఎలా ఉన్నా ఫర్లేదు కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉండాలని తన తండ్రి సూచించాడని అందుకే ఇలా వరుడు కోసం వినూత్న ప్రయత్నం చేసినట్టు చెప్పింది. ఈ ఫ్రాంక్ వీడియోను సదరు యువతి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న డిమాండ్ అలాంటిదని కామెంట్స్ చేస్తున్నారు.