గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By Selvi
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2017 (15:14 IST)

నవరాత్రులు: అలా పూజ చేస్తే..? రాహుదోషం తొలగిపోతుంది..

జాతకంలో రాహు దోషం ఉన్నవారు శరన్నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. సాధారణంగా మంగళవారం పూట రాహుకాలంలో దుర్గాదేవికి దీపమెలిగించడం ద్వారా రాహు దోషాలను నివృత్తి చేసుకోవచ్చు. అయితే శర

జాతకంలో రాహు దోషం ఉన్నవారు శరన్నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. సాధారణంగా మంగళవారం పూట రాహుకాలంలో దుర్గాదేవికి దీపమెలిగించడం ద్వారా రాహు దోషాలను నివృత్తి చేసుకోవచ్చు. అయితే శరన్నవరాత్రులు వస్తున్న వేళ.. రాహుకాల సమయంలో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే రాహు ప్రతికూల ప్రభావం తగ్గి, దోష నివారణ జరుగుతుంది.  
 
రాహు కాల పూజ సందర్భంగా దేవి అర్చనలో దేవి అర్చనలో లలితా సహస్రనామాలు, దుర్గాసప్తశతి పారాయణ చేయాలి. ఇంకా రాహు దోషం మాత్రమే కాకుండా.. రోగాలతో బాధపడే వారు, జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు శరన్నవరాత్రుల్లో తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.  
 
కాగా నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి పూర్ణిమ వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే 'శరన్నవరాత్రులు' లేదా 'దేవి నవరాత్రులు అంటారు.
 
నవ రాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. అందుచేత సృష్టికి కారణమైన మహా మాయ తీవ్రవేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం. తొమ్మిది రోజులు నవ దుర్గలను నిష్ఠగా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ తొమ్మిది రోజులలో ఒక్కోరోజున అమ్మవారిని ఒక్కో రూపంగా అలంకరించి, ఆ రూపాలకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తున్నారు. 
 
శరన్నవరాత్రులలో అమ్మవారిని మొదటి రోజున 'శైలపుత్రి'గా అలంకరించి ఆ తరువాత రోజుల్లో వరుస క్రమంలో 'బ్రహ్మచారిణి', 'చంద్రఘంట', 'కూష్మాండ',. 'స్కందమాత', 'కాత్యాయని', 'కాళరాత్రి', 'మహాగౌరీ', 'సిద్ధి దాత్రి' రూపాలుగా ఆరాధిస్తూ ఉంటారు. శైలపుత్రికి కట్టుపొంగలి, బ్రహ్మచారిణికి పులిహోర, చంద్రఘంటకు కొబ్బరి కలిపిన అన్నం, కూష్మాండకు అల్లంతో చేయబడిన గారెలు, స్కందమాతకు దధ్యోదనం, కాత్యాయనికి కేసరీబాత్, కాళరాత్రికి వివిధరకాల కూరముక్కలతో కలిపి వండిన అన్నం, మహాగౌరీకి చక్రపొంగలి, సిద్ధిదాత్రికి పాయసం అత్యంత ప్రీతికరమైనవని పండితులు చెబుతున్నారు. ఇలా తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రీతికరమైన పువ్వులు, నైవేద్యాలతో పూజ చేస్తే కార్యసిద్ధి చేకూరుతుంది.