సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By selvi
Last Modified: శనివారం, 9 సెప్టెంబరు 2017 (19:54 IST)

నవరాత్రులు.. ఐదో రోజున స్కందమాత పూజ(వీడియో)

నవరాత్రుల్లో ఐదో రోజున (సెప్టెంబర్ 25) దుర్గా మాత స్కంద మాత అవతారంలో దర్శనమిస్తారు. ఈ అవతారం రాక్షస సంహారం గావించిందని భక్తుల నమ్మకం. అమ్మవారిని నీలం రంగు చీరతో అలంకరించి భక్తులు ఉపంగ లలితా గౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజు భక్తులు తెలుపు రంగు దుస్తుల

నవరాత్రుల్లో ఐదో రోజున (సెప్టెంబర్ 25) దుర్గా మాత స్కంద మాత అవతారంలో దర్శనమిస్తారు. ఈ అవతారం రాక్షస సంహారం గావించిందని భక్తుల నమ్మకం. అమ్మవారిని నీలం రంగు చీరతో అలంకరించి భక్తులు ఉపంగ లలితా గౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజు భక్తులు తెలుపు రంగు దుస్తులు ధరించాలి. స్కందమాత అంటే కుమారస్వామికి మాత. నవరాత్రిలో ఐదో రోజున అమ్మవారిని పూజించే వారికి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా లభిస్తుంది. 
 
స్కందమాత సింహం పైన ఆశీనురాలై నాలుగు చేతులు కలిగివుంటుంది. పై రెండు చేతుల్లో తామర పువ్వు, కింది కుడి చేతితో అభయ ముద్ర కలిగి వుంటుంది. ఎడమ చేతిలో కుమారస్వామిని ప్రేమగా పట్టుకుని దర్శనమిస్తుంది. ఎరుపు రంగు దుస్తులతో అమ్మవారిని అలంకరిస్తారు. ఆరోజున పంచమి తిథి. 
 
అమ్మవారిని ఇలా ప్రార్థించాలి... 
''సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా
శుభదాస్తు సదా దేవి స్కందమాతా యశస్వినీ." 
 
వీడియోను చూడండి...