శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By ఐవీఆర్

నవరాత్రుల్లో నాలుగో రోజు.. కూష్మాండ అవతారంలో అమ్మవారు(వీడియో)

నవరాత్రుల్లో నాలుగో రోజున కూష్మాండ అవతారంలో అమ్మవారిని పూజిస్తారు. ఈమె సూర్యుడిలో దాగి ప్రపంచాన్ని వెలుగునిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అందుచేత నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం ద్వారా శక్తి లభిస్తుంది. ధైర్యం సిద్ధిస్తుంది. ఈతి బాధలు తొలగిపోతాయి. దేవీ సింహంపై ఆశీనురాలై వుంటుంది. ఎనిమిది చేతులను కలిగివుంటుంది కనుకనే ఈ మాతను అష్టభుజదేవి అని పిలుస్తారు. ఆమె చేతిలోని జపమాల ద్వారా ప్రపంచంలోని ప్రజలకు సిద్ధి, నిధిని ప్రసాదిస్తుంది. 
 
అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. కూష్మాండ అవతారాన్ని పూజిస్తారు. ఈ శక్తి అవతారమే విశ్వాన్ని సృష్టించిందని నమ్మకం. భౌమ చతుర్థిని ఆచరించి కూష్మాండ శక్తి రూపాన్ని ఎర్ర రంగు చీరతో అలంకరిస్తారు. ఈరోజు భక్తులు నారింజ రంగు దుస్తులు ధరించాలి. ఈ రోజున చతుర్థి తిథి. లలితా దేవి వ్రతాన్ని ఈ రోజున ఆచరించాలి. ఉపవాసముండి, పండ్లు పాలు తీసుకుని, ఒంటి పూట ఆహారం తీసుకుని.. లలితాదేవి పూజించినట్లైతే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఇంకా ఈ మంత్రంతో కూష్మాండ మాతను స్తుతిస్తే సకల సంపదలు చేకూరుతాయి. 
"సురా సంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవ చ 
దధాన హస్త పద్మాభ్యం కుష్మాండా శుభదాస్తుమ్."