శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2022 (10:17 IST)

శరన్నవరాత్రులు.. గాయత్రీ దేవిగా అమ్మవారు... ఆమెను పూజిస్తే.. అంతా శుభమే..

Gayathri Mantra
నవరాత్రుల్లో భాగంగా.. అమ్మవారు మూడవ రోజు శ్రీ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇక ఇంద్రకీలాద్రిపై దేవీ శరవన్నవాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో మూడో రోజు బుధవారం కనకదుర్గమ్మ.. గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. 
 
సకల మంత్రాలకు మూలశక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది.. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుపై బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు వుండటంతో గాయత్రీదేవి త్రిమూర్తి అంశగా వెలుగొందుతోంది. 
 
గాయత్రీదేవిని దర్శించుకుంటే ఆరోగ్యం, తేజస్సు, జ్ఞానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి కష్టాలు, ఉపద్రవాల నుండి గట్టెక్కిస్తుంది. అంతేకాదు గాయత్రీ దేవీని ఉపాసన చేయటంతో బుద్ధి తేజోవంతమవుతుంది.