గురువారం, 28 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 జులై 2017 (11:43 IST)

రొయ్యల పచ్చడి ఎలా తయారు చేస్తారు?

సీఫుడ్స్‌లో రొయ్యలది స్పెషల్ ప్లేస్. పచ్చిరొయ్యలను టేస్టీ.. టేస్టీగా వండుకుంటే ఒక్క ముద్దను కూడా మిగల్చరు. అలాంటి రొయ్యలతో చేసిన మెనూ మీ ముందుంది. మరి ఆ రుచుల్లో రొయ్యల పచ్చడి ఒకటి. దీన్ని ఎలా తయారు చ

సీఫుడ్స్‌లో రొయ్యలది స్పెషల్ ప్లేస్. పచ్చిరొయ్యలను టేస్టీ.. టేస్టీగా వండుకుంటే ఒక్క ముద్దను కూడా మిగల్చరు. అలాంటి రొయ్యలతో చేసిన మెనూ మీ ముందుంది. మరి ఆ రుచుల్లో రొయ్యల పచ్చడి ఒకటి. దీన్ని ఎలా తయారు చేస్తారో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
కావాల్సిన పదార్థాలు.. 
రొయ్యలు : అర కేజీ
కారం : సరిపడ
ఉప్పు : సరిపడ
నిమ్మకాయలు : 5
గరంమసాలా పొడి : ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర, మెంతులపొడి : ఒక టీ స్పూన్
ఆవపొడి : 2 టేబుల్ స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ : 30గ్రా
నూనె : తగినంత.
 
తయారీ విధానం
రొయ్యలను బాగా కడిగి నీళ్లు లేకుండా వడగట్టాలి. కాసేపు గాలికి ఆరబెట్టాలి. కడాయిలో కొద్దిగా నూనె పోసి రొయ్యలను దోరగా వేయించుకుని ఓ గంట పాటు పక్కనపెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో కారం, ఉప్పు, గరంమసాలాపొడి, జీలకర్రమెంతుల పొడి, ఆవపొడి, అల్లం, వెల్లుల్లిపేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత నూనె పోసి మరోసారి కలపాలి. ఇప్పుడు వేయించిన రొయ్యలను కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత జాడీలోకి తీసుకుంటే సరిపోతుంది. వేడి.. వేడి అన్నంలోకి ఈ పచ్చడి ఎంతో రుచికరంగా ఉంటుంది.