టేస్టీ టేస్టీ పల్లీ నూడుల్స్.. ఎలా..?

Updated: శుక్రవారం, 21 డిశెంబరు 2018 (11:08 IST)
కావలసిన పదార్థాలు:
నూడుల్స్ - 2 కప్పులు
చికెన్ - పావుకిలో
గుమ్మడికాయ ముక్కలు - అరకప్పు
ఉల్లిపాయ - 1
క్యారెట్ - 2
గుడ్లు - 2
వేయించిన పల్లీలు - అరకప్పు
సోయాసాస్ - 3 స్పూన్స్
వెనిగర్ - 1 స్పూన్
చిల్లీసాస్ - 1 స్పూన్
కొత్తిమీర - కొద్దిగా 
నూనె - 2 స్పూన్స్
కారం - తగినంత
ఉప్పు - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా నూడుల్స్‌ను వేడినీటిలో వేసి 2 నిమిషాల పాటు ఉడికించి ఆరబెట్టాలి. ఆ తరువాత చికెన్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి వేడయ్యాక క్యారెట్, ఉల్లిపాయ, గుమ్మడికాయ ముక్కలు వేసి 3 నిమిషాల పాటు వేగించి పక్కన పెట్టుకోవాలి.

ఆ తరువాత మరో బాణలిలో స్పూన్ నూనె వేసి ఉడికించుకున్న నూడుల్స్ వేసి వేయించి.. తరువాత సోయాసాస్, చిల్లీసాస్, వెనిగర్ వేసి నిమిషం పాటు వేయించుకోవాలి. ఆపై గుడ్లు పగలగొట్టి వేసి ఉప్పు, కారం కూడా వేసి 5 నిమిషాల పాటు వేయించి చికెన్, క్యారెట్, ఉల్లిపాయ, గుమ్మడికాయ ముక్కలు, పల్లీలు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. చివరగా కొత్తిమీర చల్లి తీసుకుంటే.. పల్లీ నూడుల్స్ రెడీ.

అన్నీ చూడండి

ప్రధాని మోడీ ట్వీట్‌తో ఒరిగేదేమీలేదు : ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందే : సీజేపీ

విద్యార్థుల ఆందోళనపై బాలీవుడ్ నటుల మౌనం : శశిథరూర్ విమర్శలు

ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించిన ఏపీ మంత్రి నారా లోకేష్

విద్యార్థుల ప్రశ్నలకు బారికేడ్లు - లాఠీ దెబ్బలతో సమాధానమా? కమల్ ప్రశ్న

వాష్ రూమ్‌కు కూడా వెళ్లనివ్వలేదు.. సిక్ లీవ్ తీసుకుంటే.. ఉద్యోగం నుంచి పంపేస్తారా? (video)

అన్నీ చూడండి

విజయ్ నటించిన జననాయగన్‌ను తల్లితో కలిసి వీక్షించిన త్రిష

Romanchakam :సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం రాబోతోంది

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

తర్వాతి కథనం
Show comments