సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 19 డిశెంబరు 2018 (17:29 IST)

పారుపల్లి కశ్యప్ ట్వీట్ వైరల్.. మా సీక్రెట్ స్టోరీ మీతోనే సేఫ్‌గా?

కొత్త పెళ్లి కొడుకు, పారుపల్లి కశ్యప్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. భారత స్టార్ షట్లర్లు.. సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ల ప్రేమ.. వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. డిసెంబరు 14న సింపుల్‌గా రాయదుర్గంలోని సైనా నివాసంలో ఒరియన్ విల్లాలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా రిసెప్షన్ చేసుకున్నారు. 
 
కేటీఆర్ కూడా రిసెప్షన్‌కి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేటీఆర్ రిసెప్షన్‌కి వచ్చినందుకు థ్యాంక్స్ చెబుతూ.. పారుపల్లి కశ్యప్ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తమ వివాహ రిసెప్షన్‌కు వచ్చిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పాలి. 
 
మీ ఆశీస్సులు అందించినందుకు ధన్యవాదాలు సర్. మా సీక్రెట్ స్టోరీ మీతోనే సేఫ్‌గా ఉండాలంటూ కేటీఆర్‌తో తమ దంపతులు ఉన్న ఫొటోను కశ్యప్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇదేం స్టోరీ అంట నెట్టింట చర్చ సాగుతోంది.