Daily Horoscope
✕

ఆరోగ్యానికి మేలు చేసే రొయ్యలతో క్రంచీ బాల్స్ ఎలా చేయాలంటే?

Written By సెల్వి
Updated: సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (15:23 IST)
Prawn Ball
చాలా మందికి ఇష్టమైన సీఫుడ్ రొయ్యలు. రొయ్యలతో ఆరోగ్యంతో పాటు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు. రొయ్యలలో విటమిన్ బి 12, విటమిన్ ఏ ఉంటాయి. ఇవి చర్మానికి మంచి నిగారింపును అందిస్తాయి. రొయ్యలలో ఉండే ప్రోటీన్లు శరీరంలోని కండరాల నిర్మాణానికి కొత్త కణజాలం ఏర్పాటుకు సహాయపడతాయి. అలాంటి పోషకాలతో నిండిన రొయ్యలతో  'రొయ్యల బాల్స్' ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు: 
రొయ్యలు - 500 గ్రాముల
మిరియాల పొడి - 1 టేబుల్ స్పూన్
పసుపు పొడి - 1 టేబుల్ స్పూన్
కోడిగుడ్డు - 1 టేబుల్ స్పూన్
సోయా సాస్ - 1 టేబుల్ స్పూన్ 
మొక్కజొన్న పిండి - 2 టేబుల్ స్పూన్లు
బ్రెడ్ పొడి - 8 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 2 
పెద్ద ఉల్లిపాయలు - 1 
కొత్తిమీర ఆకు - కొద్దిగా 
నూనె - అవసరమైనంత 
ఉప్పు - కావలసినంత
 
తయారీ విధానం 
ముందుగా రొయ్యలను బాగా శుభ్రం చేసి పసుపు, ఉప్పు కలిపి 10 నిమిషాలు నానబెట్టాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. నానబెట్టిన రొయ్యలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో మిరియాలు, ఉప్పు, సోయాసాస్, రొయ్యలతో పాటు గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై గిలకొట్టిన కోడిగుడ్డు మిశ్రమాన్ని రొయ్యల్లో వేసి కలపాలి. తర్వాత దానికి మొక్కజొన్న పిండి, 4 టీస్పూన్ల బ్రెడ్ పౌడర్ కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. 
 
ఈ రొయ్యల బాల్స్‌ను మిగిలిన బ్రెడ్‌క్రంబ్స్ లేదా ఫైన్ క్రంబ్స్‌లో మెల్లగా రోల్ చేసి 30 నిమిషాల వరకు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత పొయ్యిపై బాణలిని ఉంచి రొయ్యల బాల్స్ వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు నూనెలో వేయించాలి. దానిపై కొన్ని కొత్తిమీర తరుగు చల్లాలి. అంతే క్రంచీ ప్రాన్ బాల్స్ రెడీ. వీటిని చిల్లీ సాస్‌తో కలిపిన మయోనైస్‌ను కలిపి తీసుకుంటే టేస్టు అదిరిపోతుంది.
 

అన్నీ చూడండి

ఇది చూస్తే పవన్ కల్యాణ్‌కి పూనకాలే, ఆదోనిలో జనసేన రెబల్ స్టార్, వీడియో

భారత్ లౌకిక దేశం : ఆ నటి వీడియోను మళ్లీ అప్‌లోడ్ చేయండి : బాంబే హైకోర్టు ఆదేశం

ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలకే తొలి ప్రాధాన్యత : సీఎం చంద్రబాబు

ఏపీ మున్సిపల్ ఎన్నికలు : తూర్పుగోదావరి జిల్లాలో తుడిచిపెట్టుకుపోయిన వైకాపా

పిఠాపురంలో జనసేన అదుర్స్.. పెడనలో వైకాపాపై భారీ మెజార్టీతో గెలుపు

అన్నీ చూడండి

Tabu: కింగ్ 100 లో ఈసారి.. ఇది ప్రేమ కాదు అంటూ టబు ఫస్ట్ గ్లింప్స్ విడుదల

Mokshagna: నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్రం.. మేధా మేక లేదా శ్రీలీల.. ఇద్దరిలో ఎవరు?

రూ.5 కోట్లు ఇస్తావా.. చస్తావా? బాలీవుడ్ నటుడుకి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు

Suriya: సీన్ చిత్రంలో మిస్టరీ, మ్యాడ్‌నెస్, నవ్వులు అన్నీ ఉంటాయి : హీరో సూర్య

Mahesh Babu in Shotgun games: ప్రాజెక్ట్ టేక్‌డౌన్ కోసం షార్ట్‌గన్ గేమ్స్‌లో మహేష్ బాబు పెట్టుబడి

తర్వాతి కథనం
Show comments