సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 జులై 2022 (19:59 IST)

శనివారం శనిబాధలు తొలగిపోవాలంటే.. నేరేడు పండ్లను తినాలట

Black jamun
శనివారం శనిబాధల నుంచి తప్పించుకోవాలంటే.. నేరేడు పండ్లను తీసుకోవాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. దీర్ఘకాల వ్యాధులకు కారకుడైన శని జాతకంలో అనుకూలంగా లేని వారి రోగ నిరోధక శక్తిని తగ్గించి ప్రతి చిన్న రోగాన్ని దీర్ఘకాలంగా అనుభవించేటట్లు చేస్తాడు. దీని నివారణకు నేరేడు పండ్లను తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధి తీవ్రత తగ్గుతుంది. 
 
మూత్ర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కానీ గర్భిణీలు వీటిని అస్సలు తినకూడదు. ఈ నేరేడు పండ్లను శనివారం తీసుకోవడం ద్వారా మధుమేహం దరిచేరదు. అలాగే పొట్టలోని వెంట్రుకలు, మలినాలు తొలగిపోతాయి. 
Lord Shani
Lord Shani
 
శరీరానికి ఇవి చలవ చేస్తాయి. దేవునికి నేరేడు పండ్లతో నైవేద్యంగా పెడితే బాగా నీరసం, నిస్సత్తువ తగ్గిపోతుంది. జబ్బులు తగ్గిపోతాయి. ఆరోగ్యవంతులవుతారు. 
 
నేరేడు పండ్లను శనివారం శనైశ్చర స్వామికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తీసుకుంటే నడుం నొప్పి, మోకాళ్ల నొప్పి తగ్గిపోతాయి. నల్ల నేరుడును, నువ్వులతో కలిపి శనివారం దానం చేస్తే.. శనిబాధలుండవు. దారిద్రం తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.