Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుధవారం దినఫలితాలు.. ఓర్పు - చాకచక్యం ముఖ్యం...

మేషం : కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వ్యాపారాల్లో మొహమ్మాటలకు తావివ్వటం మంచిది కాదు. ఏ విషయంలోను సర్దుకుపోవడానికి మనస్సు అంగీకరించదు. ఉద్యో

Written By raman
Updated: బుధవారం, 17 జనవరి 2018 (08:31 IST)
మేషం : కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వ్యాపారాల్లో మొహమ్మాటలకు తావివ్వటం మంచిది కాదు. ఏ విషయంలోను సర్దుకుపోవడానికి మనస్సు అంగీకరించదు. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. ప్రముఖుల కలయిక  అనుకూలించదు.
 
వృషభం : ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యుల వైఖరి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో అప్రమత్తత అవసరం. ఎలక్ట్రానిక్ ఛానెళ్ల సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి. సంతానం కారణంగా దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, పట్టింపులు చోటు చేసుకుంటాయి.
 
మిథునం : అనుకున్న పనులు వాయిదా వేయడం మంచిది. కిట్టని వ్యక్తులు మిమ్ములను ఇరకాటానికి గురిచేసేందుకు యత్నిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.
 
కర్కాటకం : ఆర్థిక లావాదేవీలు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఓర్పు, చాకచక్యంతో సమస్యలను సరిచేసుకుంటారు. ఎవరికీ హామీలు ఇవ్వడం మంచిది కాదు. బంధువుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. మీ జీవిత భాగస్వామి సలహా పాటించడం వల్ల మేలు జరిగే అవకాశం ఉంది. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి.
 
సింహం : నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు లైసెన్సులు మంజూరవుతాయి. విద్యార్థుల ప్రేమ వ్యవహారం పెద్దలకు సమస్యగా మారుతుంది. గృహ నిర్మాణాల్లో పెరిగిన వ్యయం ఆందోళన కలిగిస్తుంది. సహోద్యోగులు సహకరించక పోవడంతో నిరుత్సాహం చెందుతారు. వాహనం ఇతరులకు ఇవ్వడం మంచిది కాదు.
 
కన్య : ముఖ్యమైన వ్యవహారాలను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవడం మంచిది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు పుట్టింటిపై ధ్యాస మళ్లుతుంది. వృత్తిపరంగా ఎదుర్కొంటున్న ఆటంకాలు సమసిపోగలవు. రావలసిన బాకీలు అతికష్టంమ్మీద వసూలవుతాయి.
 
తుల : ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. మీ మనస్సుకు నచ్చని విషయాలను చూసీ చూడనట్టుగా వ్యవహరించవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. స్త్రీలకు ఏ విషయంలోను మనస్థిమితం అంతగా ఉండదు. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం : ప్రభుత్వ కార్యాలయాల్లోని పనులు వాయిదా పడతాయి. మీరంటే కిట్టని వారికి మేలు చేసి వారిని మీవైపు తిప్పుకుంటారు. ఉద్యోగస్తుల పనితీరును అధికారులు ప్రశంసిస్తారు. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు, అసహనం తప్పవు. మీ అలవాట్లు, బలహీనతలు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాయి.
 
ధనస్సు : మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. వ్యాపారస్తులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం, మందలింపులు తప్పవు. మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేయండి.
 
మకరం : గత కొంత కాలంగా అనుభవిస్తున్న చికాకులు క్రమంగా తొలగిపోగలవు. ఆత్మీయులకు విలువైన కానుకలందిస్తారు. ఉద్యోగస్తులకు ట్రాన్స్‌ఫర్, ప్రమోషన్ ఆర్డర్లు చేతికందుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. నూతన పరిచయాలేర్పడతాయి.
 
కుంభం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. నూనె, మిర్చి, కంది వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు తప్పవు. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ అవసరం.
 
మీనం : అకాలభోజనం, శ్రమాధిక్యత వల్ల పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ప్రియతముల రాక మీకెంతో సంతృప్తినిస్తుంది. ఉపాధ్యాయులకు అనుకూలమైన కాలం. నిరుద్యోగులకు చిన్న సదవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. 

అన్నీ చూడండి

Pawan Kalyan, తీవ్రమైన జ్వరం, మళ్లీ భుజం నొప్పి వచ్చిందా, హుటాహుటిన హైదరాబాద్‌కి పవన్

పిల్లల ఆన్‌లైన్ భద్రతకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక బలమైన సందేశం: చందన మారిపల్లి

హర్మూజ్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోలేరు : ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఉద్యోగ ఇంటర్వ్యూల్లో 90 శాతం అవినీతి : బాబా రాందేవ్

ప్రభుత్వాలు మారినా పాఠశాలల దుస్థితి మాత్రం మారడం లేదు : అభిజీత్ దీప్కే

అన్నీ చూడండి

16-08-2026 నుంచి 22-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

15-08-2026 శనివారం మీ రాశి ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

14-08-2026 శుక్రవారం మీ రాశి ఫలితాలు- ఏ విషయానికీ కుంగిపోవద్దు...

అల్ప వర్షపాతం: తిరుమలలో వరుణ యాగం ఎందుకు జరపలేదంటే?

సమస్యలు.. వెలిగించాల్సిన దీపాలు.. అల్లం దీపాన్ని ఎందుకు వెలిగిస్తారంటే?

తర్వాతి కథనం
Show comments