శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : శనివారం, 13 జనవరి 2018 (08:39 IST)

శనివారం మీ రాశి ఫలితాలు: దంపతుల మధ్య చిరు కలహాలు తప్పవు

మేషం: కమ్యూనికేషన్, టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఏదైనా అమ్మాలనే ఆలోచన క్రియారూపంలో పెట్టండి. మీ రాక బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తుంది. తరచు సన్మానాల సభల్లో ప

మేషం: కమ్యూనికేషన్, టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఏదైనా అమ్మాలనే ఆలోచన క్రియారూపంలో పెట్టండి. మీ రాక బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తుంది. తరచు సన్మానాల సభల్లో పాల్గొంటారు. విదేశాలలోని వారికి వస్తు సామగ్రి, విలువైన పత్రాలు అందజేస్తారు.
 
వృషభం: నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు స్వల్ప ఆటుపోట్లు తప్పవు. పత్రికా ఉద్యోగస్తులకు ఏకాగ్రత చాలా అవసరం. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం విషయంలో మెళకువ వహించండి. స్త్రీలు ప్రతిభాపోటీల్లో రాణిస్తారు. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది.
 
మిథునం: పత్రికా సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటుంది. ఉద్యోగ రీత్యా ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసివస్తుంది. ఎదుటివారితో వాగ్వివాదాలు, పంతాలకు పోవటం మంచిదికాదు. రుణయత్నాల్లో ఆటంకాలు తొలగిపోగలవు. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, అందుకు అనువైన పరిస్థితులు నెలకొంటాయి.
 
కర్కాటకం: వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కలవరపెడతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. భాగస్వామ్యులతో  కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అందరి సహాయ, సహకారాలు అందుకుంటూ ప్రశాంతంగా గడుపుతారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.
 
సింహం: దంపతుల మధ్య చిరు కలహాలు తప్పవు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో ధనం అధికంగా వ్యయం చేస్తారు. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసివస్తుంది. ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచన వాయిదా వేయటం మంచిది. ప్రయాణాల్లో ఊహించని ఒత్తిడి, చికాకులు తలెత్తుతాయి
 
కన్య: నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఏకాగ్రత చాలా అవసరం. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. బంధుమిత్రులతో ప్రయాణాలు సాగిస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్యమైన ఫలితాలను ఇస్తాయి. రాజీ ధోరణితో వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యల పరిష్కారమవుతాయి.
 
తుల: ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచన వాయిదా వేయడం మంచిది. స్త్రీలకు షాపింగ్‌ల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్తగా చేపట్టబోయే వ్యాపారాలు, సంస్థలకు కావలసిన పెట్టుబడి సర్దుబాటు కాగలదు. మార్కెట్ రంగాల వారికి, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం వంటివి తప్పవు.
 
వృశ్చికం: ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. మీ యత్నాలకు ప్రముఖుల నుంచి సహాయ సహకారాలు అందిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు ఊహించినవే కావడంతో ఇబ్బందులు వుండవు. గృహ మరమ్మత్తులు అనుకూలిస్తాయి.
 
ధనస్సు : మీ పాత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. స్త్రీలకు టీవీ కార్యక్రమాల్లో అవకాశం, బహుమతులు అందుతాయి. ధనం చేతిలో నిలబడటం కష్టం కావచ్చు. అకాల భోజనం, ప్రశాంతత లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
మకరం: మీ సంతానం విద్యా, ఆరోగ్యం విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారం లభిస్తుంది. ఖర్చులు, చెల్లింపులు అధికమవుతాయి. స్త్రీల ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువు చేజార్చుకునే అవకాశం ఉంది.
 
కుంభం: స్త్రీల అభిప్రాయాలకు వ్యతిరేకత ఎదురవుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రభుత్వ కార్యక్రమాల్లోని పనులు అనుకూలిస్తాయి. రావలసిన ధనం రావడంతో పాటు ఖర్చులు కూడా అధికమవుతాయి. రాత పరీక్షల యందు మీరు గణనీయమైన విజయాన్ని సాధిస్తారు.
 
మీనం: ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. అందరికీ సహాయం చేసి మాటపడతారు. తోటి ఉద్యోగుల మీద ఆధారపడి ఏ కార్యాలు చేయవద్దు. ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగాలకు టార్గెట్ పూర్తి కావడం కష్టతరమవుతుంది.