గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : మంగళవారం, 9 జనవరి 2018 (08:32 IST)

మంగళవారం దినఫలాలు - మానసిక ప్రశాంతత చేకూరుతుంది

మేషం : ఆర్థిక విషయాల్లో సహోద్యోగులు మొహమాటం పెట్టే అవకాశం ఉంది. ఆలయ సందర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. వ్యాపారాభివృద్ధికి బాగా శ్రమిస్తారు. వాతావరణంలోని మార్పుల వల్

మేషం : ఆర్థిక విషయాల్లో సహోద్యోగులు మొహమాటం పెట్టే అవకాశం ఉంది. ఆలయ సందర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. వ్యాపారాభివృద్ధికి బాగా శ్రమిస్తారు. వాతావరణంలోని మార్పుల వల్ల మీ పనులు వాయిదాపడతాయి. స్త్రీలు, టీవీ ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. 
 
వృషభం : మీకు రాబోయే ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు సిద్ధమవుతుంది. గట్టిగా యత్నిస్తేనే కానీ మొండిబాకీలు వసూలు కావు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. స్పెక్యులేషన్ నిరుత్సాహపరుస్తుంది. స్త్రీలకు సంపాదనపై ఆసక్తి పెరుగుతుంది. 
 
మిథునం : విద్యార్థినిలకు కొత్త పరిచయాలు, వాతావరణం సంతృప్తినిస్తాయి. వృత్తుల వారికి శ్రమించిన కొలదీ ఆదాయం. స్త్రీలతో మితంగా సంభాషించడం అన్నివిధాలా మంచిది. ఉద్యోగస్తులు అధికారుల నుండి మెప్పు పొందుతారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి.
 
కర్కాటకం : మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. పెండింగ్ పనులు పూర్తికాకపోవడంతో ఉద్యోగస్తులు అధికారులతో మాటపడక తప్పదు. వృత్తులవారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. గృహ నిర్మాణాలకు కావలసిన బ్యాంకు లోన్లు మంజూరు కాగలవు. 
 
సింహం : లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. సొంతంగా గానీ, భాగస్వామ్యంగా గానీ మీరు ఆశించిన విధంగా రాణించలేరు. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. స్త్రీలు తొందరపాటుతనం వల్ల ప్రియతములను దూరం చేసుకుంటారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
కన్య : వ్యాపారాల్లో పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. దైవదర్శనాల్లో శ్రమ, ప్రయాసలెదుర్కొంటారు. చేతి వృత్తులు, చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. ఇంట్లోనూ, సంఘంలో మీ మాటకు విలువ ఉండదు. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. 
 
తుల : వ్యాపారస్తులకు యాజమాన్యం నుండి ఒత్తిడి అధికమవుతుంది. బంధువుల రాకపోకల వల్ల ధనం అధికంగా వ్యయం చేయవలసి వస్తుంది. దూరప్రయాణం చేయవలసి వస్తుంది. కుటుంబంలో కలతలు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. స్త్రీలకు టీవీ ఛానళ్లు, కళాత్మక పోటీలకు సంబంధించిన సమాచారం అందుతుంది. 
 
వృశ్చికం : ప్రేమికుల తొందరపాటుతనం సమస్యకు దారితీస్తుంది. కోర్టు వ్యవహారాల్లో సానుకూలత తక్కువ. ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలు అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండటం క్షేమదాయకం. తరచూ ఉద్యోగ, వ్యాపార విషయాలలో ప్రయాణం చేయలవలసి వస్తుంది. 
 
ధనస్సు : భాగస్వామిక ఒప్పందాల్లో మీ ప్రతిపాదనలకు వ్యతిరేకత ఎదురవుతుంది. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. అనుకున్న మొత్తం చేతికందుతుంది. మీ లక్ష్య సాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయండి. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 
 
మకరం : దైవ, పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కూరగాయలు, పండ్లు, పూలు, వ్యాపారులకు పురోభివృద్ధి. వాహనం నపుడునపుడు మెలకువ అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య సమస్యలు తలెత్తుతాయి. రుణాలు తీర్చడానికి చేయుయత్నాలు ఫలిస్తాయి. 
 
కుంభం : ఆర్థిక కార్యకలాపాలు చాలా సమర్థవంతంగా నడుపుతారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. ఉన్నట్టుండి వేదాంత ధోరణి కానవస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలతకు పలుమార్లు తిరగలవలసి ఉంటుంది. ఉద్యోగస్తులుకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. 
 
మీనం : కొన్ని విషయాల్లో అంచనాలు తారుమారవుతాయి. ప్రేమికులకు పెద్దల నుంచి ప్రోత్సాహం సన్నిహితుల నుంచి సహకారం ఉంటాయి. మీ వృత్తికి సంబంధించిన వ్యవహారాలను శ్రద్ధగా మలచుకోవడం వల్లనే వాటికి పరిష్కారం లభిస్తుంది. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.