Webdunia - Bharat's app for daily news and videos

Install App

08-11-2018 - గురువారం దినఫలాలు - ఆ రంగాల వారిలో చురుకుదనం...

Written By రామన్
Updated: గురువారం, 8 నవంబరు 2018 (12:34 IST)
మేషం: మీ జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆత్మీయులు, బంధువుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. మీ గౌరవ ప్రతిష్టకు భంగం కలుగకుండా వ్యవహరించండి. దూరప్రయాణాలు అనుకూలం. వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాల వలన ఇబ్బందులు లెదుర్కుంటారు. 
 
వృషభం: స్త్రీలకు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఖర్చులు ఊహించలనే కావడంటో పెద్దగా ఇబ్బందులుండవు. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు నష్టాల బాటలో సాగుతాయి. రవాణా రంగాలలోని వారికి ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల ఏకాగ్రత అవసరం.  
 
మిధునం: బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రిప్రజెంటేటివ్‌లకు నెమ్మదిగా మార్పులు కానవస్తాయి. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ కార్యకలాపాల్లో చికాకులు, పనిభారం, అధికారుల నుండి ఒత్తిడి వంటి చికాకులు తప్పవు.  
 
కర్కాటకం: సిమెంట్, ఐరన్, కలప రంగాలలో వారికి వారి రంగాలలలో చురుకుదనం కానవస్తుంది. శత్రువులు మిత్రులుగా మారిమీకు సహాయాన్ని అందిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు ఇతరుల జోక్యం వలన వాయిదాపడుతాయి. ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.  
 
సింహం: ఒక శుభకార్యం నిశ్చయం కావడంతో కల్యాణ మంటపాల కోసం అన్వేషిస్తారు. దంపతుల మధ్య కలహాలా తలెత్తుతాయి. దైవదీక్షలు స్వీకరిస్తారు. పొగాకు, ప్రత్తి రంగాలలో వారికి కలిసి వచ్చేకాలం. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి.  
 
కన్య: యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. లౌకికంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనకూలంగా మలుచుకుంటారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. విదేశీ వస్తువులపై ఆసక్తి పెరుగుతుంది.  
 
తుల: స్త్రీలు ఉపవాసాలు, శ్రమాధిక్యత కారణంగా స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఖర్చులు అధికం. మిత్రుల కలయికతో నూతన ఉత్సాహం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు ముందుకు సాగక నిరుతాహ్సం చెందుతారు. హోటల్, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు ఒక వార్త ఎంతో ఆందోళన కలిగిస్తుంది.      
 
వృశ్చికం: విద్యార్థుల మెుండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. బంధువుల కోసం ధనం ఖర్చుచేస్తారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలీయమవుతుంది. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. ఇతురులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. నూతన దంపతులకు సంతాన ప్రాప్తి.    
 
ధనస్సు: డాక్టర్లు శస్త్రచికిత్సలో విజయాన్ని సాధిస్తారు. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. స్త్రీలకు ప్రతి విషయంలోను తమ మాటె నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది. వృత్తి పరంగా ఎదురైన సమస్యలను అధికమిస్తారు. ప్రేమికులకు సన్నిహితులు అండగా నిలుస్తారు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి.  
 
మకరం: కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం విరమించుకోవడం శ్రేయస్కరం. నూతన వస్తువులను కొనుగోలుచేస్తారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో తోటివారి సహాయ సహాకారాలు లభిస్తాయి. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.   
 
కుంభం: ఆర్థిక విషయాలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తారు. మీ కష్టం ఫలించడంతో అనిర్వచినీయమైన ఆనందం పొందుతారు. ప్రింటింగ్ రంగాల్లోవారికి అచ్చుతప్పులు పడడం వలన మాటపడతారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. దైవకార్యాల పట్ల ఆసక్తి నెలకొంటుంది.   
 
మీనం: మీ అవసరాలు, బలహీనతలను ఇతరులు స్వార్థానికి వాడుకుంటారు. వృత్తుల వారికి సంఘంలో మంచి గుర్తింపు, తగిన ప్రతిఫలం లభిస్తుంది. బ్యాంకు పనులు వాయిదాపడుతాయి. మీ జీవిత భాగస్వామితో ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి.  

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో జరిగిన అమెజాన్ వార్షిక సమావేశంలో మీర్జాపూర్ తారల సందడి

పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడు.. గర్భిణీ మహిళ ఆత్మహత్య

First baby girl in 200 years: 200 సంవత్సరాల తర్వాత ఆడబిడ్డ.. పండగ చేసుకున్నారు..

Sabarimala Gold Case: శబరిమలలో బంగారం మాయం.. ప్రశాంత్‌కు బెయిల్

కొండా సురేఖ ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించిన కేఏ పాల్

అన్నీ చూడండి

03-09-2026 గురువారం రాశి ఫలితాలు... కొత్త ప్రాజెక్ట్‌కు అనుకూలమైన రోజు

Nepal flash flood 2026: నేపాల్ వరదలు.. ముందుగానే పలాంచోక్ భగవతి అమ్మవారికి చెమటలు.. హెచ్చరిక? (video)

Krishna Jayanti 2026 Significance : శ్రీకృష్ణ జయంతి పూజ.. కృష్ణుని జననానికి ఆధారాలు ఉన్నాయా?

Tirumala: సర్వ దర్శన్ టోకెన్ల జారీని రద్దు చేసిన టీటీడీ

02-09-2026 బుధవారం రాశి ఫలితాలు... సమయపాలన అవసరం

తర్వాతి కథనం
Show comments