మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శనివారం, 3 నవంబరు 2018 (09:58 IST)

03-11-2018-శనివారం మీ రాశి ఫలితాలు.. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు..?

మేషం: ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు యధావిధాగా సాగుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుతాయి. గృహ నిర్మాణాలు, మరమత్తులు చేపడతారు. ఆపద సమయంలో బంధుమిత్రులు అండగా నిలుస్తారు. దూర ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. స్త్రీలలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. 
 
వృషభం: కార్యదీక్షతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా పురోభివృద్ధి. పత్రిక, ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తితడి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాతపరీక్షల్లో మెళకువ అవసరం. ఖర్చులు అధికమవుతాయి.  
 
మిధునం: లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన మంచిది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. సంతానం విషయంలో సంజాయిషీలు ఇచ్చుకోవలసి వస్తుంది. అవివాహితులకు కలిసివచ్చే కాలం. పెద్దల ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి.  
 
కర్కాటకం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. అజ్ఞాత వ్యక్తుల వలన మోసపోయే ఆస్కారం ఉంది. విద్యార్థినుల్లో ఏకాగ్రత లోపం వలన ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి మీ పనులు త్వరితగతిన పూర్తిచేస్తారు. రుణం తీర్చడానికి చేయు యత్నాలు ఫలిస్తాయి.    
 
సింహం: సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలు సంతృప్తినిస్తాయి. మీ అభిప్రాయాలతో కుటుంబీకులు సానుకూలంగా స్పందిస్తారు. ఆదాయవ్యయాలు సరిసమానంగా ఉండడం వలన పొదుపు సాధ్యం కాదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి.   
 
కన్య: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడుతాయి. స్త్రీలకు ఆధ్యాత్మిక చింతనతోపాటు ఇతర వ్యాపకాలు అధికమవుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, రిజిస్ట్రేషన్లు అనుకూలిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి.   
 
తుల: పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. అతిథి మర్యాదలు సమర్థంగా నిర్వహిస్తారు. విద్యార్థులకు తోటివారి ధోరణి చికాకు పరుస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు అన్ని విధాలాకలిసి రాగలదు. స్త్రీలు అందరితోను కలుపుగోలుగా వ్యవహరిస్తారు. నిరుద్యోగుల ఇంటర్వ్యూల్లో సఫలీకృతులవుతారు.  
 
వృశ్చికం: వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొరవ ఉండదు. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి సంతృప్తి, పురోభివృద్ధి. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలించవు. ఉద్యోగస్తులు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు.  
 
ధనస్సు: హోటల్, క్యాటరింగ్ పనివారలు, వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, రేషన్ డీలర్లకు అధికారుల నుండి వేధింపులు తప్పవు. మీపై ఆధారపడిన వారి పట్ల విజ్ఞాతాయుతంగా మెలగండి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఎప్పటి నుండో అనుకుంటున్న మెుక్కబడులు తీర్చుకుంటారు.  
 
మకరం: ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ వంటి శుభ పరిణామాలున్నాయి. మీ శ్రీమతి నుండి అన్ని విధాలా ప్రోత్సాహం లభిస్తుంది. దంపతుల మధ్య అపోహలు తొలగి అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. కోర్టు వ్యవహారాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. విదేశీయానం యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.   
 
కుంభం: రాబడికి మించిన ఖర్చులు, చెల్లింపుల వలన స్వల్ప ఆటుపోట్లు తప్పవు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ప్రభుత్వ కార్యక్రమాల్లో పనులు వాయిదాపడుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది.  
 
మీనం: ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారి వలన అదనపు పనిభారం తప్పదు. స్త్రీలకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు అనుకూలిస్తాయి.