మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

08-11-2020- ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఉమాపతిని ఆరాధిస్తే శుభం..

ఉమాపతిని ఆరాధించినట్లైతే శుభం, జయం చేకూరుతుంది. 
 
మేషం: హాస్టళ్ల సందర్శన, విహారయాత్రలకు అనుకూలిస్తాయి. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తప్పవు. అయిన వాళ్ళే మీ యత్నాలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచండి. కార్యసాధనకు ధనం బాగా వ్యయం చేయాల్సివస్తుంది. తరుచు బంధుమిత్రుల రాకపోకలుంటాయి.
 
వృషభం: పుణ్యక్షేత్ర సందర్శనలు, వనసమారాధనలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా అధికారులకు గుర్తింపు ఉండదు. హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసివస్తుంది. ఒక యత్నం ఫలించలేదని నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించండి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు.
 
మిథునం: వస్త్ర, బంగారం, పచారీ, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలకు టీవీ ఛానెళ్ళ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. మీ అతిథి మర్యాదలు ఎదుటివారిని సంతృప్తి పరుస్తాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి, అవాంతరాలు ఎదురవుతాయి. 
 
కర్కాటకం: దైవదీక్షల పట్ల ఆసక్తి నెలకొంటుంది. అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతం కావడంతో వైద్యుల పేరు ప్రఖ్యాతలు ఇనుమడిస్తాయి. స్థిరాస్తుల కొనుగోళ్ళపై దృష్టి సారిస్తారు. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి తోటివారి తీరు ఇబ్బంది కలిగిస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
సింహం: సోదరీ సోదరుల గురించి ఓ రహస్యం తెలుసుకుంటారు. విద్యార్థుల చురుకుదనం, పాఠ్యాంశాల పట్ల వారి ఏకాగ్రతకు మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్యుల మధ్య సత్సంబంధాలు నెలకొని ఉండగలవు. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు ఆశించిన పదోన్నతి అవకాశం ఆగిపోయే ఆస్కారం వుంది.
 
కన్య: రుణవిముక్తులు కావడంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. విషయ పరిజ్ఞానం లేనివారితో వాదనలకు దిగడం మంచిది కాదు. ఇంట్లో మార్పులు, చేర్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ప్రతి విషయంలోను సర్దుకుపోయే విధంగా వ్యవహరించాల్సి వుంటుంది. నమ్మకం, పట్టుదలతో శ్రమించండి. అనుకున్నది సాధిస్తారు.  
 
తుల: పారిశ్రామిక రంగాల వారికి ఊహించని చికాకులెదుర్కోవలసి వస్తుంది. స్త్రీలకు ఏ విషయం పట్ల ఆసక్తి అంతగా ఉండదు. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. మీ ఏమరుపాటు తనం వల్ల ఇబ్బందులు తప్పవు.
 
వృశ్చికం: స్త్రీలకు శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. తలపెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలెదుర్కుంటారు. బంధువుల రాకతో మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
ధనస్సు: ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో పోటీ తత్వం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ యత్నం ఫలిస్తుంది.
 
మకరం: మీ సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. భేషజాలకు పోకుండా ధనం మితంగా వ్యయం చేయండి. మీ ప్రమేయం లేకుండానే కొన్ని చిక్కు సమస్యలు పరిష్కారమవుతాయి. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు పనివారితో చికాకులు అధికమవుతాయి. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు.
 
కుంభం: చిన్ననాటి స్నేహితుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. రుణంలో కొంచెం మొత్తమైనా తీర్చాలన్న మీ యత్నం ఫలిస్తుంది. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు తప్పవు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ధ్యేయం కార్యరూపం దాల్చుతుంది. ప్రయాణాల్లో మెళకువ అవసరం.
 
మీనం: ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టడం మంచిది. స్త్రీలకు బంధువులతో సఖ్యత నెలకొంటుంది. పత్రిక, ప్రింటింగ్ పనివారలకు ఒత్తిడి, పనిభారం అధికం. ఓర్పు, సర్దుబాటు ధోరణితో వ్యవహరించడంతో ఒక సమస్య పరిష్కారం కాగలదు.