సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

05-11-2020 గురువారం దినఫలాలు - సాయినాథుడి భజన చేస్తే...

మేషం : ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. అనుకోని ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల ఒడిదుడుకులు తప్పవు. స్త్రీలకు వాగ్ధానాలు చేయడం మంచిది కాదు. తరచూ తీర్థయాత్రలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. 
 
వృషభం : స్థిరాస్తి క్రయ విక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ప్రేమికుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. 
 
మిథునం : వస్త్రాలు, ఆభరణాలు విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరిక నెరవేరుతుంది. కోర్టు పనులు వాయిదాపడుట మంచిది. పాత బకాయిలు వసూలవుతాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుకూలమైన సమయం. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి లాభదాయకం. 
 
కర్కాటకం : పారిశ్రామిక రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలు శుభకార్యాలలో కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. బ్యాంకింగ్ రంగాలలో వారికి ఒత్తిడి, చికాకులు అధికం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. 
 
సింహం : ఆర్థిక లావాదేవీలు, ఒత్తిడి, హడావుడి అధికంగా ఉంటాయి. సందోర్భచితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు లాభిస్తాయి. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గృహంలో శుభకార్యం చెయ్యాలి అనే ఆలోచన స్ఫురిస్తుంది. హామీ, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 
 
కన్య : వ్యపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు ప్రణాళికలు మున్ముందు మంచి ఫలితాలనిస్తాయి. విలువైన కానుకలను అందించి ప్రముఖులను ప్రసన్నం చేసుకుంటారు. కుటుంబీకుల మధ్య కీలకమైన విషయాలు చర్చకు వస్తాయి. సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం సేకరిస్తారు. మిత్రులు నుంచి ఒక ముఖ్య సమాచారం గ్రహిస్తారు. 
 
తుల : దంపతుల మధ్య ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. భాగస్వాములతో పలు విషయాలు చర్చిస్తారు. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు వాయిదావేయడం మంచిది. మీ కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. నూతన పెట్టుబడులకు, వ్యాపారాల విస్తరణలకు కావలసిన ధనం సమకూరుతుంది. 
 
వృశ్చికం : సంఘంలో మీ మాట తీరుకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ పాత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉమ్మడి వ్యాపారాలు సమర్థంగా సాగవు. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఆర్థిక వ్యవహారాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంస్మరణల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మీ సంతానం విద్య, వివాహ విషయాల పట్ల దృష్టిసారిస్తారు. రుణ విముక్తులు కావడంతోపాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి ఖాతాదారుల నుంచి చికాకులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. 
 
మకరం : ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. తలపెట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. ఖర్చులు, అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. రాజకీయాలు, కళ, సాంస్కృతిక, ప్రకటనల రంగాల వారు లక్ష్యాలు సాధించడం కష్టం. 
 
కుంభం : బంధువుల మధ్య అనురాగ్య వాత్సల్యాలు పెంపొందుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీ పనులు మందకొడిగా సాగడం, జాప్యం వంటి చికాకులను ఎదుర్కొంటారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. 
 
మీనం : బ్యాంకింగ్ రంగాల వారు అధిక ఒత్తిడిని శ్రమను ఎదుర్కొంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు చేయడం అంత మంచిదికాదు. స్త్రీల మనోభావాలను మంచి స్ఫురణ లభిస్తుంది. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. అనుకోకుండా కలిసిన ఒక వ్యక్తికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.