శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

02-11-2020 సోమవారం మీ రాశి ఫలితాలు- మల్లికార్జునుడిని ఆరాధిస్తే...?

మల్లికార్జునుడిని ఆరాధించినట్లైతే మీ సంకల్పం సిద్ధిస్తుంది. 
 
మేషం: పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి చికాకులు అధికమవుతుంది. వాతావరణంలో మార్పు తోటల రంగాల వారికి ఆందోళన కలిగిస్తుంది. సేవా, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. మీ కళత్ర మొండితనం చికాకు కలిగిస్తుంది. వైద్యులకు మెళకువ ఏకాగ్రత అవసరం. 
 
వృషభం: పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. వాహనచోదకులకు చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఓర్పు. ఏకాగ్రత ఎంతో ముఖ్యం. 
 
మిథునం: ప్రముఖుల కలయిక వాయిదా పడటంతో నిరుత్సాహానికి గురవుతారు. మందులు, రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. ఉద్యోగస్తుల సమర్థత, పనితీరుకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రతి విషయాన్ని మీ శ్రీమతికి తెలియజేయడం మంచిది. ఏజెంట్లకు, బ్రోకర్‌లకు అనుకూలం.
 
కర్కాటకం: వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ వుండదు. మీ ప్రియతముల పట్ల, ముఖ్యుల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. విద్యార్థినుల మొండితనం అనర్ధాలకు దారితీస్తుంది. సోదరీ సోదరుల గురించి ఓ రహస్యం తెలుసుకుంటారు. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు పడటం వల్ల మాటపడతారు.
 
సింహం: ఆర్థిక సమస్య వల్ల ఒకింత ఆందోళనకు గురవుతారు. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి రాగలవు. కలప, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం వుంది.
 
కన్య: రాజకీయాల్లో వారికి స్నేహ బృందాలు అధికమవుతాయి. ప్రింటింగ్ రంగాల వారు అక్షర దోషాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఉపాధ్యాయులు పై అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి. మీ సంతానం కోసం ధనం వ్యయం చేస్తారు.
 
తుల: కళ, క్రీడా, సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో పోగొట్టుకున్నది తిరిగి దక్కించుకుంటారు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయవద్దు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. విదేశీ ప్రయాణాలకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఫైనాన్స్, చిట్‌ఫండ్ వ్యాపారస్తులకు సంతృప్తి కానరాగలదు.
 
వృశ్చికం: కంప్యూటర్, టెక్నికల్, ఐటీ రంగాల్లో వారికి సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. నూతన పరిచయాలేర్పడతాయి. భాగస్వామిక సమావేశాలు అర్థాంతరంగా ముగుస్తాయి. మీ ఆశయ సిద్ధికి నిరంతర కృషి పట్టుదల ముఖ్యమని గమనించండి.
 
ధనస్సు: విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో లౌక్యం అవసరం. ప్రభుత్వ రంగ సంస్థల్లో వారికి అధికశ్రమ, పనిభారం అధికం కాగలదు. ట్రాన్స్‌పోర్ట్, ఆటో మొబైల్, రంగాల్లో వారికి పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. మీ విజయానికి మీ స్నేహితుల సహకారం లభించగలదు. 
 
మకరం: భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెళకువ వహించండి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు, మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. కొబ్బరి, పండ్ల, పానీయ, కేటరింగ్, హోటల్ తినుబండ వ్యాపారులకు శుభదాయకంగా ఉండగలదు.
 
కుంభం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. దంపతుల మధ్య విభేదాలు తొలగి సఖ్యత నెలకొంటుంది. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఒక వ్యవహారంలో బంధుమిత్రులు మీ తీరును తప్పుపడతారు.
 
మీనం: సాంఘిక, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుభవం లేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లోని వారికి పనిభారం అధికమవుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. షాపింగ్ కోసం ధనం వెచ్చిస్తారు.