మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By ఠాగూర్

28-10-2020 బుధవారం రాశిఫలాలు - సత్యదేవును పూజించి అర్చించినా...

మేషం : ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఉపాధ్యాయులు ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందుతారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
వృషభం : ఉమ్మడి నిధుల నిర్వహణలో మాటపడాల్సి వస్తుంది. పెట్టుబడులకు క్రయ, విక్రయాలలో దూకుడు తగదు. సంస్మరణలు, పూజలలో పాల్గొంటారు. ముందు చూపుతో వ్యవహరించండి. పెద్దలతో సోదరుల విషయాలు చర్చకు వస్తాయి. పై అధికారులు, ప్రముఖులతో వాగ్వివాదాలకు దిగకండి. ఫ్లీడరు విశ్రాంతి పొందుతారు. 
 
మిథునం : వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికం. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. బంధు మిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన పనులు వాయిదాపడతాయి. 
 
కర్కాటకం : దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ధనం బాగా అందుట వల్ల ఏ కొంతైనా నిల్వచేయగలుగుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. క్రయ విక్రయ రంగాలలో వారికి కలిసివస్తుంది. స్త్రీలకు తలకు కణతికి సంబంధించిన చికాకులు ఎదుర్కొనవలసి వస్తుంది. 
 
సింహం : ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్, ఆటోమొబైల్ రంగాల వారికి ఆశాజనకం. మీ బంధువులు, కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలకు అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. ఏ పని తలపెట్టినా అనుకోని అవాంతరం వచ్చిపడుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. 
 
కన్య : ఆదాయానికి తగినట్టుగా ధనం వ్యయం చేస్తారు. స్థిరచరాస్తుల విషయం గురించి పునరాలోచన అవసరం. కాంట్రాక్టర్లకు రావలిసన ధనం చేతికందుతుంది. కళా రంగాల పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. మీ విరోధులు కూడా మీ సహాయం అర్థిస్తారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. 
 
తుల : కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. విద్యార్థుల్లో నూతన ఉత్సాహం కానవస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల, కూరలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. కీర్తి ప్రతిష్టలకు కించిత్ భంగం వాటిల్లేసూచనలున్నాయి. 
 
వృశ్చికం : శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. మీ కుటుంబీకులతో కలిసి వేడుకలో పాల్గొంటారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. కళ, సాంస్కృతిక, క్రీడా రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యతలను ఎదుర్కొంటారు.
 
ధనస్సు : అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారు నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. పత్రికా రంగాలలో వారికి పనిభారం అధికమవుతుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. 
 
మకరం : మీ మాటతీరు, పద్ధతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ఉపాధ్యాయులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఆలయ సందర్శనాలలో మెళకువ అవసరం. బంధువుల రాకతో గృహంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. 
 
కుంభం : బంధువులలో మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచితుల పట్ల మెళకువ అవసరం. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ కుటుంబీకుల కోసం కొత్త కొత్త పథకాలను వేస్తారు. 
 
మీనం : రాజకీయ నాయకులకు ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులకు లోనవుతారు. మీ సంతానం గురించి ఆందోళన చెందుతారు. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత, మెళకువ అవసరం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మిత్రులను కలుసుకుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి.