మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

25-10-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు-అమ్మవారికి మహా నైవేద్యం సమర్పించి..?

అమ్మవారికి మహా నైవేద్యం సమర్పించి ఆరాధించినట్లైతే అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
 
మేషం: వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి అనుభం, కొద్దిపాటి లాభాలు గడిస్తారు. కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు, కార్యక్రమాలు గుర్తుగా రాసి ఉంచుకోవడం ఉత్తమం. స్త్రీలు షాపింగ్‌లోనూ, కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వుండాలి.
 
వృషభం: బంధువుల రాకతో పనులు, కార్యకలాపాలు మందకొడిగా సాగుతాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం కలిసివస్తుంది. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ సంకల్పం నెరవేరుతుంది. సన్నిహితుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు.
 
మిథునం: కుటుంబీకుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఎంతటి కష్టాన్నైనా నిబ్బరంగా భరిస్తారు. మిత్రుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం అందుంతుంది. దుబారా ఖర్చులు మీకు తెలియకుండానే అవుతాయి. సోదరుల ఆస్తి పంపకాల ప్రస్తావన వస్తుంది. ప్రయాణాలు అనుకూలం.
 
కర్కాటకం: అయిన వారి కోసం బాగా శ్రమిస్తారు. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. మీ వ్యతిరేకతను సున్నితంగా వ్యక్తం చేయండి. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు భిన్నంగా ఉంటాయి. చిన్ననాటి వ్యక్తుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకానొక విషయంలో మీ కళత్ర మొండివైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది.
 
సింహం: వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా చూసుకోండి. వాహనం, వస్తువులు, గృహోపకరణాలు అమర్చుకుంటారు. రాజకీయ నాయకులు ప్రముఖులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. పెద్దల జోక్యంతో ఆస్తి, కుటుంబ వివాదాలు సద్దుమణుగుతాయి. మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
 
కన్య: సన్మాన సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. దాంపత్య సుఖం, మానసిక ప్రశాంతత పొందుతారు. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి.
 
తుల: బంధువులతో తెగిపోయిన సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో నిరాశ తప్పదు. వ్యవహార ఒప్పందాల్లో చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి.
 
వృశ్చికం: కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. మీ వాహనం, విలువైన వస్తువులు ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి. తొందరపాచు నిర్ణయం వల్ల వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం వుంది. దూర ప్రయాణాల్లో పరిచయాలేర్పడతాయి. ఒక దైవ కార్యం ఘనంగా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
ధనస్సు: సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. స్త్రీలకు నరాలు, దంతాలు, రుతు సంబంధిత చికాకులు అధికం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ సంతానంతో ఉల్లాసంగాను, ఉత్సాహంగాను గడుపుతారు.
 
మకరం: బంధువులతో విభేదాలు తలెత్తే ఆస్కారం వుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్థిరాస్తుల కొనుగోళ్ళపై దృష్టి సారిస్తారు. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. వ్యాపార, ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు సఫలీకృతులవుతారు.
 
కుంభం: చిన్న తప్పిదాలే పెద్ద సమస్యగా మారే అవకాశం వుంది. స్త్రీల ప్రతిభా పాటవాలకు ప్రోత్సాహం లభిస్తుంది. చిన్న తప్పిదాలే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి వుండాల్సి వస్తుంది. 
 
మీనం: ఉద్యోగస్తులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు, పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. విద్యార్థులు ప్రతిభా పోటీల్లో రాణిస్తారు. తలపెట్టిన పనిలో ఆటంకాలు ఎదురైనా ధైర్యం, పట్టుదలతో శ్రమించి విజయం సాధిస్తారు.