గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

24-10-2020 శనివారం రాశిఫలాలు - ఆవుపాలను తీర్థంగా తీసుకుంటే...

మేషం : ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధికమిస్తారు. వ్యాపారాల్లో కొంత నిరాశ తప్పదు. మీ సంతానం మొండి వైఖరి వల్ల చికాకులు తప్పదు. పొదువు ఆవశ్యకతను గుర్తిస్తారు. స్త్రీలకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విలువైన పత్రాలు, రశీదులు అందుకుంటారు. దైవచింతన పెరుగుతుంది.
 
వృషభం : బంధువుల రాకతో గృహంలో సందడి కానవచ్చును. చిన్ననాటి వ్యక్తుల కలయిక ఉత్సాహం కలిగిస్తుంది. తెలివిగా వ్యవహరిస్తామనుకుని తప్పడుగు వేస్తారు. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం చేయకండి. 
 
మిథునం : పత్రికాసంస్థల్లోని వారు ఎంత శ్రమించినా యాజమాన్యాన్ని మెప్పించగలరు. బంధువుల రాక అసౌకర్యం కలిగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల రంగాలలో వారికి అనుకూలం. చేపట్టిన పనులు ఏమాత్రం ముందుకుసాగవు. స్త్రీలకు అనవసర ప్రసంగాలు అపార్థాలకు దారితీస్తాయి. మెళకువ అవసరం. 
 
కర్కాటకం : ఆర్థిక కుటుంబ విషయాల పట్ల దృష్టిసారిస్తారు. బంధు మిత్రులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేయునపుడు పునరాలోచన చాలా అవసరం. మీ కళత్ర మొండివైఖరి వల్ల మనశ్శాంతిని కోల్పోతారు. ఉపాధ్యాయులకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. 
 
సింహం : ఎంత సంపాదించినా ధనం నిలబెట్టుకోలేకపోతారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. కొన్ని విషయాలు మరిచిపోలానుకున్నా సాధ్యంకాదు. బ్యాంకు పనులు వాయిదాపడతాయి. 
 
కన్య : మీ సమస్యలను ఆత్మీయులకు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారం అందిస్తారు. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయమవుతారు. మహిళా ఉద్యోగస్తులకు తోటివారి వల్ల చికాకులు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
తుల : స్త్రీలకు తల, కళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఆదాయ వ్యయాలు మీ అంచనాలను మించుతాయి. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
వృశ్చికం : సిమెంట్, కలప, ఐరన్, ఇసుక వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. మీకు నచ్చని సంఘటనలు కొన్ని ఎదురుకావచొచ్చు. ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు చేస్తారు. శ్రీవారు శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. 
 
ధనస్సు : సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులు వ్యవహరించిన తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. రాజకీయాలో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
మకరం : ఉపాధ్యాయులకు ఒత్తిడి, జాప్యం పెరుగుతుంది. నిరుద్యోగులు ఇచ్చిన తాత్కాలిక అవకాశాన్ని చేజిక్కించుకోవడం శ్రేయస్కరం. వృత్తిపరంగా చిన్న చిన్న ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. ధనం సమయానికి సమకూరటం వల్ల మీలో నూతన ఉత్సాహం కానరాగలదు.
 
కుంభం : భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో మాటపడవలసి వస్తుంది. ఉద్యోగస్తులు పైఅధికారుల మెప్పుకోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రముఖుల కోసం వేచివుండగక తప్పదు. 
 
మీనం : మీకు రావలసిన అవకాశాలు, పదవులు వేరొకరికి లభిస్తాయి. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు అనుకూలమైన కాలం. కుటుంబంలో పెద్దల మొండివైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారులకు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం మంచిది.