శనివారం, 4 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-11-2020 మంగళవారం మీ రాశి ఫలితాలు- కార్తీకేయుడిని..?

కార్తీకేయుడిని తెల్లని పువ్వులతో పూజించినట్లైతే మీ సంకల్పం సిద్ధిస్తుంది. 
 
మేషం: ఇంటా బయటా మీ ఆధిపత్యం కొనసాగుతుంది. కళ, క్రీడా, టెక్నికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. భాగస్వామిక సొంత వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. 
 
వృషభం: ఏ విషయంలోను ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. మీ సంతానం కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఆకస్మిక బదిలీ వంటి పరిణామాలున్నాయి. నూతన దంపతులు కొత్త అనుభూతికి లోనవుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత చాలా అవసరమని గమనించండి. 
 
మిథునం: కుటుంబ, ఆర్థిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఒక శుభకార్యం నిశ్చయం కావడంతో కళ్యాణ మంటపాల కోసం అన్వేషిస్తారు. దూర ప్రయాణాలు విరమించుకోవడం శ్రేయస్కరం. వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు. స్త్రీలకు దైవ కార్యాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. 
 
కర్కాటకం: మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. వస్త్ర, బంగారం, పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి. దీక్షా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. తరుచూ బంధుమిత్రుల రాకపోకలుంటాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో వాయిదా పడటం మంచిది.
 
సింహం: విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు తెలుసుకుంటారు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల ఇబ్బందులెదుర్కుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. గృహనిర్మాణాల్లో బిల్డర్లకు ఒత్తిడి, పనివారలతో చికాకులు తప్పవు. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి.
 
కన్య: ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. రాజకీయ నాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం, కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. మీ గౌరవ ప్రతిష్టకు భంగం కలుగకుండా వ్యవహరించండి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.
 
తుల: ముఖ్యమైన వ్యవహారాల్లో సావధానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ శ్రీమతి మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఏ యత్నం ఫలించకపోవడంతో నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు. ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. 
 
వృశ్చికం : వృత్తిరీత్యా ప్రయాణాల్లో ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. వాహనం విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో నిరుత్సాహం తప్పదు. బంధువులతో పట్టింపులు అధికమవుతాయి. విద్యార్థులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
ధనస్సు: వస్త్ర, బంగారం, పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి. వివాహ, ఉద్యోగ యత్నాలు ముమ్మరంగా సాగిస్తారు. శకునాల కారణంగా మీ ప్రయాణం వాయిదా వేసుకుంటారు. బంధువులను కలుసుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. 
 
మకరం: అనుకున్నది సాధ్యపడకపోవడంతో మీలో పట్టుదల పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో చికాకులు తప్పవు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదు. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులకు అనుకూలం. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులు, క్యాటరింగ్ పనివారలకు కలిసివస్తుంది. 
 
కుంభం: వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి నిరంతరం శ్రమించాలి. స్త్రీలతో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులు వివరణ ఇచ్చుకోవాల్సి వుంటుంది. ఆత్మీయుల ఇంట ఒక శుభకార్యానికి సహాయ సహకారాలందిస్తారు. ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. 
 
మీనం: వస్త్ర, బంగారం, పచారీ, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు.