మంగళవారం, 21 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2024 (16:50 IST)

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

lord ganesha
అకురథ సంకష్టి చతుర్థి అనేది డిసెంబర్ 18న వస్తోంది. ఈ రోజున వినాయకుడిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. ఉపవాసం పాటించాలి. గణేశుడిని నిష్ఠతో పూజించాలి. 
 
పసుపు రంగు పువ్వులు, బూందీ లడ్డూలు, మోదకాలు నైవేద్యంగా సమర్పించాలి. అరటిపండ్లు సమర్పించవచ్చు. గణేశ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ రోజున సంకష్టి చతుర్థి కథను చదవండి లేదా వినండి. పూజ అనంతరం గణేశునికి హారతిని ఇచ్చి.. అనంతరం ప్రసాదాన్ని అందరికీ పంచాలి. 
 
సాయంత్రం చంద్రోదయం తరువాత చంద్రునికి అర్ఘ్యం సమర్పించి దర్శనం చేసుకోండి. అప్పుడు ఉపవాసం విరమించండి. ఈ రోజు పూజ తర్వాత, బ్రాహ్మణులకు ఆహారం అందించడంతో పాటు పేదలకు దానం చేయడం ముఖ్యంగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. 
 
సంకష్ట చతుర్థి రోజున చేసే ఉపవాసం అనారోగ్య, ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉపయోగపడుతుంది. ఈ వ్రత ప్రభావంతో భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి.