శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (09:17 IST)

#DailyHoroscope 12-08-2019- సోమవారం మీ రాశి ఫలితాలు..

మేషం: ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ కళత్ర మొండి వైఖరి, కుటుంబీకుల పట్టుదల మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఆహార వ్యవహారాలలో మెళుకువ వహించండి. పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారస్తులకు లాభాదాయకం. ప్రయాణాలు అనుకూలం. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు.
 
వృషభం: విద్యార్థులు క్రీడా రంగలలో బాగా రాణిస్తారు. మిత్రులతో కలసి వేడుకలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం. బంధువుల వైఖరి నిరుత్సాహ పరుస్తుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సఖ్యత లోపిస్తుంది. రాజకీయ నాయకులు తరుచు సభ, సమావేశాలలో పాల్గొంటారు.
 
మిధునం: సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు ఆశించినంత లాభసాటిగా ఉండదు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలలో భంగపాటు తప్పదు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సభ, సమావేశాల్లో పాల్గొంటారు. ముందుచూపుతో ఆలోచించి మీరు తీసుకున్న నిర్ణయం మంచి ఫలితానిస్తుంది.
 
కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలో ఏకాగ్రత ముఖ్యం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. నూతన పరిచయాలేర్పడతాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించ వలసి ఉంటుంది.
 
సింహం: కోర్టు వ్యవహారాల్లో ఫలతాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహారంలో ఏకాగ్రత, విషయ పరిజ్ఞానం అవసరం. మొండి బాకీలు సైతం వసూలుకాగలవు. స్త్రీలకు బంగారం, నూతన వస్త్రాలపై మక్కువ పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలు ఎదుర్కొంటారు.
 
కన్య: వృత్తి ఉద్యోగాల్లో కొంత పురోగతి ఉంటుంది. దైవ సేవా కార్య క్రమాలలో పాల్గొంటారు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగ యత్నాలు కలిసివస్తాయి. వాహన చోదకులకు ఊహించని చికాకు లెదుర్కోవలసి వస్తుంది. బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో పునరాలోచన మంచిది.
 
తుల: కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలు ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహ నిర్మాణ ప్లాను ఆమోదం పొందటంతో పాటు రుణాలు అనుకూలిస్తాయి. రిప్రజెంటేటివ్‌లు, ప్రవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ద తీసుకుంటారు.
 
వృశ్చికం: ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవటం మంచిది. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మునుముందు మంచి ఫలితాల నిస్తాయి. ఇతరుల వ్యాఖ్యాలు మీ పై తీవ్ర ప్రభావం చూపుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం.
 
ధనస్సు: బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. స్త్రీలకు పనివారలతో  చికాకులు తప్పవు. మీ సంతానానికి ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులలో అవకాశం లభిస్తుంది. కష్టసమయంలో అయిన వారే ముఖం చాటేస్తారు. ఒక భారం దించుకున్న తరువాతనే కొత్త పనులు చేపట్టటం మంచిది.
 
మకరం: మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు. హోటల్, తినుబండారాలు, బేకరీ పనివారలకు సామాన్యం. ఖర్చులు అధికమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదుటివారిని సలహా అడగటం మంచిదని గమనించండి. మీ పనులు మీరే స్వయంగా చూసుకోవడం శ్రేయస్కరం.
 
కుంభం: తలపెట్టిన పనులలో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. సాఘిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు పనిభారం అధికం. పత్రిక, ప్రైవేటు సంస్ధలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి.
 
మీనం: ఆస్తి వ్యవహారాల్లో ముఖ్యలతో విబేధాలు తలెత్తుతాయి. విద్యార్ధులకు మిత్రబృందాలు, వ్యాపకాలు అధికం కాగలవు. ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో సానుకూలత లుంటాయి. ప్రియతములు ఇచ్చే సలహా మీకు ఎంతో సంతృప్తి నిస్తుంది.