09-08-2019 శుక్రవారం మీ రాశిఫలాలు - వరలక్ష్మీ వ్రతం చేస్తే...

రామన్| Last Updated: శుక్రవారం, 9 ఆగస్టు 2019 (10:40 IST)
మేషం: దైవ సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికమవుతుంది. కుంటుంబలో ప్రశాంతత నెలకొంటుంది. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. మీ శక్తి సామర్థ్యాలపై అందరికీ నమ్మకం ఏర్పడుతుంది. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి.

వృషభం: స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో పునరాలోచన మంచిది. ఆపత్సమయంలో సన్నిహితులు గుర్తుకొస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. అవివాహితులు కొత్త అనుభూతికి లోనవుతారు. ఏజెన్సీలు, లీజు, టెండర్ల వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం.

మిధునం: ఉన్నతాధికారులకు తనిఖీలు, పర్యవేక్షణలలో ఏకాగ్రత ముఖ్యం. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు ఆలస్యంగా అందుతాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కొన్ని సందర్భాల్లో మీ అంచనాలు, ఊహలు నిజమవుతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు ఆలస్యంగా అందుతాయి.

కర్కాటకం: ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. గృహంలో ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. స్త్రీల ఆరోగ్యంలో ఆశించినసంతృప్తి కానవస్తుంది.
వస్తు కొనుగోళ్లలో నాణ్యతకే ప్రాధాన్యమిస్తారు. ట్రాన్స్‌పోర్టు. ట్రావెలింగ్ అధికారులకు పురోభివృద్ధి.


సింహం: విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. ముక్కుసూటిగా పోయే మీతత్వం వివాదాలకు దారితీస్తుంది. స్త్రీల అభిప్రాయాలకు ఏమాత్రం స్పందన ఉండదు. ప్రయాణాలలోను, బ్యాంకు వ్యవహారాలలోను మెళుకువ అవసరం. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది.

కన్య: ప్రేమికులకు ఓర్పు, సమయస్ఫూర్తి బాగా అవసరం. నూతన వ్యాపారాలు, వ్యాపారాల విస్తరణలకు కావలసిన అనుమతులు, వనరులు సమకూర్చుకుంటారు. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. మీ అలవాట్లు, మాటతీరు ఇబ్బందులకు దారితీస్తుంది. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు.

తుల: ఆర్ధికస్థతి సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కొంత పురోగతి సాధిస్తారు. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.

ధనస్సు: ప్రముఖుల సిఫార్సుతో నిరుద్యోగులకు మంచి అవకాశం లభిస్తుంది. మిత్రులలో వచ్చిన మార్పు నిరుత్సాహం కలిగిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలం. కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలస్తాయి.

ధనస్సు: ప్రముఖుల సిఫార్సుతో నిరుద్యోగులకు మంచి అవకాశం లభిస్తుంది. మిత్రులలో వచ్చిన మార్పు నిరుత్సాహం కలిగిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలం. కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి.

మకరం: మీ శక్తిసామర్థ్యాలపై విశ్వాసం సన్నగిల్లుతుంది. రుణాలు, చేబదుళ్ళు స్వీకరించవలసి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మునుముందు మంచి ఫలితాలనిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఏకాగ్రత ముఖ్యం.

కుంభం: ఆత్మీయుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. పత్రిక. ప్రైవేటు సంస్థలలోనికి ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఆదాయానికి మించి ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఆటుపోట్లు ఎదుర్కుంటారు.

మీనం: ధనం మితంగా వ్యయం చేయటం శ్రేయస్కరం. ఉమ్మడి, సొంత వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమిస్తారు. దూర ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. మీ ఆలోచనలు స్థిమితంగా ఉండవు. సన్నిహితుల హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు ఎదుర్కొంటారు.దీనిపై మరింత చదవండి :