శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2019 (08:46 IST)

07-08-2019 బుధవారం దినఫలాలు - ఇల్లుగానీ, ఆఫీసుగానీ...

మేషం : గణిత, సైన్స్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ తొందరపాటు నిర్ణయాల వల్ల చికాకులు తప్పవు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దూరదేశాలు వెళ్లేందుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికం.
 
వృషభం : ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తలపెట్టిన పనుల్లో సఫలీకృతులౌతారు. ప్రియతములిచ్చే సలహా మీకెంతో సంతృప్తినిస్తుంది. కందులు, ఎండుమిర్చి, స్టాకిస్టులు, వ్యాపారస్తులు ఒక అడుగు ముందుకేస్తారు. ధనం సమయానికి అందటంవల్ల సంతృప్తి కానవస్తుంది.
 
మిథునం : కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. ప్రియతముల రాక సమాచారం మీకెంతగానో సంతోషాన్నిస్తుంది. ఉన్నతాధికారులకు తనిఖీలు, పర్యవేక్షణలలో ఏకాగ్రత ముఖ్యం. శుభకార్యాలు, ఆడంబరాలకు ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు అలవాటుపడతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
 
కర్కాటకం : దైవదర్శనాలు, మొక్కబడులు ఆకస్మికంగా సానుకూలమవుతాయి. మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తారు. విద్యార్థులకు ప్రేమికుల వేధింపులు అధికం అవుతాయి. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తుల వారికి శ్రమ అధికం. ఆదాయం స్వల్పంగా ఉంటుంది.
 
సింహం : ఇల్లుగానీ, ఆఫీసుగానీ మారాల్సి రావచ్చు. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతటదే వస్తుంది. అనుకున్నవి సాధించి, ఎనలేని తృప్తిని పొందుతారు. ఒకానొక సమయంలో చేతిలో ధనం లేక బాగా అవస్థపడతారు. కొన్ని బంధాలను నిలుపుకునేందుకు కష్టపడాల్సి వస్తుంది. మీకు నచ్చిన విషయాలపై దృష్టి పెడతారు.
 
కన్య : హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ రంగాలలోని వారికి కలసివచ్చే కాలం. వాహనం కొనుగోలుకై చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు, స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. సంతానం ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తారు. విదేశాల్లో ఉన్న ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది.
 
తుల : కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇతరుల కారణంగా మీరు మాట పడాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆత్మీయులతో కలసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ సమసిపోగలవు.
 
వృశ్చికం : పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీ ఆలోచనలు క్రియారూపంలో పెట్టి జయం పొందండి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఊహించని ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించండి.
 
ధనస్సు : విద్యార్థులు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. నిర్మాణ పనులలో మెలకువ వహించండి. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు చుట్టుప్రక్కల వారినుంచి ఆహ్వానాలు అందుతాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు చికాకులు తప్పవు.
 
మకరం : దూరంలో ఉన్న వ్యక్తుల గురించి కీలకమైన సమాచారం అందుకుంటారు. స్పెక్యులేషన్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. బ్యాంకు లావాదేవీలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. పదిమందిని కూడగట్టుకుని ఓ మంచి పనికి శ్రీకారం చుడతారు. కుటుంబ అవసరాలకు, మీ సంతానం కోసం ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు.
 
కుంభం : పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. జాయింట్ వెంచర్లు, ఒప్పందాలకు సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా వ్యవహరించండి. ముఖ్యుల కలయిక అనుకూలిస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
మీనం : సహోద్యోగులతో సమావేశాలలో పాల్గొంటారు. స్త్రీలు తేలికగా మోసపోయే ఆస్కారం కలదు. ఖర్చులు మీ స్తోమతకు తగినట్లుగానే ఉంటాయి. బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. మీ కళత్ర మొండివైఖరి మీకు మరింత చికాకును కలిగిస్తుంది. అందరినీ మెప్పించగలరు.