#DailyHoroscope 02-08-2019- శుక్రవారం మీ రాశి ఫలితాలు..

రామన్| Last Updated: బుధవారం, 11 సెప్టెంబరు 2019 (18:40 IST)
మేషం : కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు. మీ శ్రీమతి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వృత్తి నైపుణ్యం పెంచుకోవటానికి బాగా శ్రమించాలి. బ్యాంకింగ్, చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి బకాయిలు వసూలు విషయంలో సమస్యలు తప్పవు. ముఖ్యులలో ఒకరి గురించి ఆందోళన తప్పదు. ఉద్యోగులకు పనిభారం అధికం.

వృషభం : ఉన్నతాధికారులకు అదనపు బాధ్యతలు, ఆకస్మిక స్థానచలనం వంటి పరిణామాలున్నాయి. పెరిగిన పోటీవాతావరణం వల్ల వారి టార్గెట్‌కు భంగం వాటిల్లుతుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత అవసరం. వైద్యరంగాల వారికి అన్నివిధాలా శుభం కలుగుతుంది. కాంట్రక్టర్లకు బిల్లులు మంజూరవుతాయి.

మిథునం : రాజకీయ నాయకులు తరచు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన పెన్షన్ విషయంలో శ్రమ, ప్రయాసలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి శుభదాయకంగా ఉంటుంది. మిమ్మల్ని అభిమానించే ఆత్మీయులను బాధపెట్టడం మంచిది కాదని గమనించండి. బిల్లులు చెల్లిస్తారు.

కర్కాటకం : భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. స్త్రీలకు షాపింగ్ విషయాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదవకాశాలు లభిస్తాయి.

సింహం : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. కళాకారులకు, రచయితలకు ఒత్తిడి పెరుగుతుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు సంతోషం కలిగిస్తుంది. దూరప్రయాణాలలో కొత్త పరిచయాలేర్పడతాయి. క్రయ విక్రయాలు లాభదాయకం.

కన్య : స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచన వాయిదా వేయటం మంచిది. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు కలిసిరాగలదు. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. బంధువులను కలుసుకుంటారు.

తుల : గతంలో మిమ్ములను విమర్శించిన వారే మీ పురోభివృద్ధిని, ఖ్యాతిని గుర్తించి కొనియాడుతారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కార్యసాధనలో ఆటంకాలెదురైనా ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేయండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. మిత్రుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనవలసివస్తుంది.

వృశ్చికం : ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. గృహంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. కుటుంబములో ఖర్చులు పెరిగినా సార్థకత ఉంటుంది.

ధనస్సు : మీ అతిధి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పధకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇతరులకు హామీలు ఇచ్చే విషయంలోను, మధ్యవర్తిత్వ వ్యవహారాలకు దూరంగా ఉండటం అన్నివిధాలా మంచిది. కుటుంబ సౌఖ్యం, తరచు విందు భోజనాలు వంటి శుభ సంకేతాలున్నాయి.

మకరం : రావలసిన ఆదాయం అనుకోకుండా వసూలు కావటం, రుణవిముక్తి, తాకట్టు విడిపించు కోవటం వంటి శుభఫలితాలు ఉంటాయి. ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి.

కుంభం : కొబ్బరి, పండు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేధాలు తలెత్తవచ్చు. వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. రాజకీయాలలో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.

మీనం : అనవసరపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఆహార విషయంలో వేళ తప్పి భుజించుట వలన ఆరోగ్యం భంగం. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. ప్రయాణాలు, కీలకమైన వ్యవహారాల్లో మెళుకువ వహించండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.దీనిపై మరింత చదవండి :