బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : ఆదివారం, 28 జులై 2019 (08:59 IST)

28-07-2019 ఆదివారం దినఫలాలు - ఆర్ధిక విషయాల్లో గోప్యంగా...

మేషం: ఆర్ధికపరమైన చర్చలు, సమావేశాల్లో జాగ్రత్త వ్యవహరించండి. దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదా పడుట వల్ల ఆందోళన గురౌతారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
వృషభం: ఆర్ధిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. గృహ నిర్మాణానికి సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. ప్రముఖుల కోసం షాపంగ్‌లు చేస్తారు. మీ కళత్ర వైఖరి మీకు చికాకులను కలిగిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి.
 
మిథునం: కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు సంబంధించిన అధికారుల సహకారం అందుతుంది. క్రీడా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ చుట్టు ప్రక్కల వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్త అవసరం. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు.
 
కర్కాటకం: వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రయాజనాలు సాధించడం కష్టసాధ్యం. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. అదనపు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. స్త్రీలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. వాహన ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
సింహం: హోటల్, తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. విద్యార్థినులు మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. స్త్రీల ప్రతిభాపాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్నేహితులతో కలసి ఉల్లాసంగా గడుపుతారు.
 
కన్య: ఆదాయం బాగున్నా ఆర్థిక సంతృప్తి ఉండదు. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత, సహనం ఎంతో ముఖ్యం. గృహ మరమ్మత్తులు, నిర్మాణాలు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. నిరుద్యోగులకు ఆశాజనకం.
 
తుల: ప్రముఖుల సహకారంతో మీ సమస్య ఒకటి సానుకూలంగా పరిష్కారమవుతుంది. దంపతుల మధ్య చిన్ని చన్ని కలహాలు ఏర్పడతాయి. దూర దేశాలు వెళ్ళడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
వృశ్చికం: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఆపత్సమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక విచిత్ర కల మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు పరిచయాలు అధికమవుతాయి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం.
 
ధనస్సు: ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. మిత్రులను కలుసుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాదు. ఆస్తి పంపకాల్లో తలెత్తిన విభేదాలు పరిష్కారమవుతాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యంలో ఏకాగ్రత అవసరం.
 
మకరం: హోటల్, తినుబండారాలు, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు కలిసివస్తుంది. మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. చిట్‌ఫండ్, ఫైనాన్సు రంగాలలోని వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
కుంభం: రాబోయే ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. అర్థాంతంగా ముగించిన పనులు పునఃప్రారంభస్తారు. మనస్సుకు నచ్చని సంఘటనలు ఎదుర్కుంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పుణ్యక్షేత్రాలు, నూతన ప్రదేశ సందర్శనలకు ప్రణాళికలు రూపొందిస్తారు.
 
మీనం: దైవ సేవా కార్యక్రమాల్లో ఆటంకాలను అధికమిస్తారు. మీ వాహనం మరమ్మత్తులకు గురయ్యే ఆస్కారం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు మీరు చూసుకోవటమే ఉత్తమం. రుణ విముక్తులు కావటంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. బంధువులను కలుసుకుంటారు. ప్రేమికుల తొందరపాటు అనర్థాలకు దారితీస్తుంది.