శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 23 జులై 2019 (09:16 IST)

23-07-2019 మంగళవారం దినఫలాలు - హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల...

మేషం : దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. పై అధికారులు, ప్రముఖులతో వాగ్వివాదాలకు దిగకండి. మీ కళత్ర సహకారంతో ఒక సమస్య పరిష్కారం కాగలదు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. హోటల్ తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి సామాన్యంగా ఉంటుంది.
 
వృషభం : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాల నివ్వగలవు. అనుకోని ఖర్చులు, ఇతరత్రా సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. స్థిరాస్తి ఏదైనా అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా పడుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. పత్రికా సంస్థల్లో వారికి మార్పులు వాయిదాపడతాయి.
 
మిథునం : ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. పండు, పూలు, కొబ్బరి, కూరగాయల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండగలదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిష్కరింప బడతాయి. మిత్రులను కలుసుకుంటారు.
 
కర్కాటకం : రాజకీయ నాయకులకు పదవులందు అనేక మార్పులు ఏర్పడతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టునపుడు మెళుకువ వహించండి. లాయర్లకు మిశ్రమ ఫలితం ఉండగలదు. ప్రత్తి, పొగాకు రైతులకు నెమ్మదిగా మార్పులు సంభవిస్తాయి. ఇప్పటివరకు విరోధులుగా ఉన్నవారు మీ సహాయం అర్థస్తారు. బిల్లులు చెల్లిస్తారు.
 
సింహం : డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభిస్తారు. పాత మిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. విదేశీయానాలకై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. ఖర్చులు అదుపు చేస్తారు.
 
కన్య : కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఖర్చులు పెరిగినా సమయానికి కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి.
 
తుల : ఆర్థిక వ్యవహారాల పట్ల శ్రద్ధ వహిస్తారు. తప్పిదాలు అధికారులదే అయినా క్రింది స్థాయి ఉద్యోగులే బాధ్యులవుతారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ మాట నెగ్గకపోయినా మీ గౌరవానికి భంగం కలుగుదు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
వృశ్చికం : ఉద్యోగస్థులకు అధికారుల నుండి సమస్యలు తలెత్తినా తోటివారి సహకారంవలన సమసిపోగలవు. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆప్తుల ద్వారా సంతోషకరమైన వార్తలువింటారు.
 
ధనస్సు : లీజు, ఏజెన్సీ వ్యవహారాలలో పెద్దల సలహా పాటించటం శ్రేయస్కరం. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి. పాత పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. వాగ్వివాదాలకు, ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది.
 
మకరం : చేతివృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. బ్యాంకు లావాదేవీ లందు అనుకూలిస్తాయి. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. దంపతుల మధ్య అవగాహనాలోపం చికాకులు వంటివి చోటుచేసుకుంటాయి. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యుత్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
 
కుంభం : ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి చికాకులు అధికం అవుతాయి. రుణాలు, చేబదుళ్ళకు యత్నాలు సాగిస్తారు. గతంలో వాయిదా పడిన పనులు పునఃప్రారంభిస్తారు. అలంకారాలు, వస్త్రాలు, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల రాకతో గృహంలో కొంత అసౌకర్యానికి గురౌతారు.
 
మీనం : మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల మనస్సులను బాధపెట్టకండి. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. పట్టుదలతో శ్రమించే మీకు సన్నిహితుల సాయం తోడవుతుంది. రాజకీయనాయకులు తరచు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలలో మీదే పైచేయిగా ఉంటుంది.